Uttar Pradesh: ఎలుకను చంపిన వ్యక్తిపై 30 పేజీల చార్జిషీట్!

30 Page Charge sheet Against man who killed Rat
  • ఎలుక తోకకు రాయికట్టి కాలువలో పడేసిన నిందితుడు
  • గతేడాది నవంబరులో ఘటన
  • నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • మాంసం వ్యాపారులు, ఎలుకలను చంపే రసాయనాలు విక్రయించే వారిపైనా చర్యలు తీసుకోవాలన్న నిందితుడి తండ్రి
ఎలుక హత్యకేసుకు సంబంధించి ఉత్తరప్రదేశ్ పోలీసులు నిందితుడిపై 30 పేజీల చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే.. గతేడాది నవంబరులో కుమార్ అనే వ్యక్తి ఎలుక తోకకు రాయి కట్టి దానిని కాలువలో పడేశాడు. దీనిని గమనించిన వికేంద్రశర్మ అనే వ్యక్తి దానిని కాలువ నుంచి బయటకు తీసి కాపాడే ప్రయత్నం చేశాడు. అయితే, అది అప్పటికే మరణించింది. 

దీంతో వికేంద్రశర్మ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కుమార్‌ను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన బెయిలుపై విడుదలయ్యాడు. ఎలుక కళేబరానికి నిర్వహించిన ఫోరెన్సిక్ నివేదికలో కాలేయ ఇన్ఫెక్షన్, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సోకిందని, ఫలితంగా ఊపిరాడక చనిపోయిందని తేలింది.

ఈ కేసుకు సంబంధించి పోలీసులు తాజాగా నిందితుడు కుమార్‌పై 30 పేజీల చార్జ్‌షీట్ దాఖలు చేశారు. కాగా, ఈ ఘటనపై కుమార్ తండ్రి మతూరా కుమార్ మాట్లాడుతూ.. తన కుమారుడిపై చర్యలు తీసుకోవడానికి ముందు కోళ్లు, చేపలు, గొర్రెల మాంసాన్ని అమ్మే వ్యాపారులపైన, ఎలుకలను చంపే రసాయనాలు అమ్మే వారిపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Uttar Pradesh
Rat
Rat Killing Case

More Telugu News