Samantha: ఈ తరానికి దొరికిన 'శకుంతల' సమంతనే!

Samantha Special

  • 'శకుంతల' పాత్రకి గల ప్రత్యేకత వేరు
  • ఇంతవరకూ ఈ పాత్రను చేసిన హీరోయిన్స్ చాలా తక్కువమంది
  • ఈ జనరేషన్ లో సమంతకి మాత్రమే దక్కిన అదృష్టం 
  • ఆమె కెరియర్లో ఎప్పటికీ ప్రథమస్థానంలో నిలిచే పాత్ర ఇది
  • ఈ నెల 14వ తేదీన విడుదలవుతున్న సినిమా

అందం .. అభినయంతో పాటు అదృష్టం కూడా పుష్కలంగా ఉన్న కథానాయిక సమంత. హీరోయిన్ గా సమంత ఎంట్రీ ఇచ్చేటప్పటికీ తెలుగు .. తమిళ్ భాషల్లో గట్టిపోటీ ఉంది. అలాంటి పరిస్థితుల్లో అవకాశాలను అందుకోవడం .. అవి విజయాలను సాధించడం .. స్టార్ హీరోయిన్ గా ఎదగడం చకచకా జరిగిపోయాయి. ఆశ్చర్యం ఏమిటంటే ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి ఆమె ఇంతవరకూ అవకాశాల కోసం ఎదురుచూడవలసిన అవసరం లేకపోవడం. 

తెలుగు .. తమిళ భాషల్లోని స్టార్ హీరోలందరితోను ఆమె వరుస సినిమాలు చేస్తూ వెళ్లింది. నాయిక ప్రధానమైన పాత్రలలోను ఆమె తన సత్తా చాటుకుంది. చూడటానికి ఎప్పుడూ నవ్వుతూ కాస్త అమాయకంగా కనిపించే సమంత, కెమెరా ముందుకు వచ్చిందంటే మాత్రం ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేసేస్తుంది. నాయిక ప్రధానమైన సినిమాలు చేయడం ఆమెకి కొత్తకాకపోయినా, అలాంటి ఒక సాధారణ సినిమాగా 'శాకుంతలం'ను చూడలేం. 

శకుంతల పాత్రలో ఎన్నో వేరియేషన్స్ ఉంటాయి. ప్రేమలో .. ప్రకృతిలో మమేకమయ్యే పాత్ర ఇది . ప్రేమ .. విరహం .. వియోగం .. విషాదం వీటినన్నిటిని ఒకదాని తరువాత ఒకటిగా అనుభవించే శకుంతల పాత్రను చేయడం అనుకున్నంత తేలిక కాదు. ఈ పాత్రను చేయాలనుకోని హీరోయిన్ ఉండదు. ఇంతవరకూ ఈ పాత్రను చేసినవారిని వ్రేళ్లపై లెక్కపెట్టొచ్చు.

సాంకేతిక పరిజ్ఞానం .. తెలుగు సినిమా పరిథి ప్రపంచపటాన్ని ఆక్రమించిన తరువాత సమంతకి మాత్రమే దక్కిన అవకాశం ఇది. ఇంతవరకూ సమంత పోషించిన పాత్రలన్నీ ఒక వైపు .. ఈ పాత్ర ఒక్కటీ ఒక వైపు వేయవచ్చు. ఇకపై సమంత ఎన్ని పాత్రలు చేసినా, 'శకుంతల' పాత్ర ఆమెకి ఎప్పటికీ ప్రత్యేకంగానే నిలిచిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరో శకుంతలను ఆవిష్కరించే ప్రయత్నం ఇప్పట్లో జరగదు గనుక, ఈ తరానికి సమంతనే శకుంతల అనడంలో ఎలాంటి సందేహం లేదు. 

Samantha
Dev Mohan
Gunasekhr
Dil Raju
Shaakuntalam Movie
  • Loading...

More Telugu News