Surya: పది భాషల్లో సూర్య సినిమా .. టైటిల్ ఎనౌన్స్ మెంట్ ఆ రోజునే!

Surya and Shiva Cinema Update

  • సూర్య నుంచి మరో ప్రయోగాత్మక చిత్రం 
  • కెరియర్ పరంగా ఇది ఆయనకి 42వ సినిమా 
  • ఈ నెల 16వ తేదీన సినిమా టైటిల్ రిలీజ్ 
  • కథానాయికలుగా నయనతార .. దిశా పటాని

కోలీవుడ్లో కథల పరంగా .. పాత్రల పరంగా కొత్తదనానికి ప్రాధాన్యతనిచ్చే హీరోలలో సూర్య ముందు వరుసలో కనిపిస్తారు. ఇంతవరకూ ఆయన చేసిన సినిమాలలో చాలానే ప్రయోగాలు కనిపిస్తాయి. అలాంటి సూర్య నుంచి 42వ సినిమా రెడీ అవుతోంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి ఇంకా టైటిల్ ను ఖరారు చేయలేదు. 

ఈ సినిమా కథాకథనాలు విభిన్నంగా ఉండనున్నాయి. అందువలన టైటిల్ ఎలా ఉండనుందనేది అభిమానులలో ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టైటిల్ ఎనౌన్స్ మెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 16వ తేదీన ఉదయం 9:05 నిమిషాలకు టైటిల్ ను ప్రకటించనున్నట్టు చెబుతూ ఒక పోస్టర్ ను వదిలారు. 

అటవీ ప్రాంతంలో విల్లంబులు ధరించి గుర్రాలపై వేటాడే ఒక వేటగాడు, ఆ గుర్రంపై ఒక కొండ కొస నుంచి మరో కొండపైకి జంప్ చేస్తున్నట్టుగా ఈ పోస్టర్ ఉంది. పక్కనే ఆ గుర్రాన్ని అనుసరిస్తూ వేటకుక్క కూడా కనిపిస్తోంది. నయనతార .. దిశా పటాని కథానాయికలుగా నటిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. పది భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

Surya
Nayanatara
Disha Patani
Shiva
  • Loading...

More Telugu News