Soori: 'విడుదల' చూస్తూ నేను క్లాప్స్ కొట్టకుండా ఉండలేకపోయాను: అల్లు అరవింద్

Vidudala Press Meet

  • తమిళంలో హిట్ కొట్టిన 'విడుదలై'
  • తెలుగులో ఈ నెల 15వ తేదీన విడుదల 
  • ప్రధానమైన పాత్రను పోషించిన సూరి 
  • కీలకమైన పాత్రలో కనిపించనున్న విజయ్ సేతుపతి 
  • జనంలోకి ఈ సినిమాను తీసుకెళ్లమని ప్రెస్ ను కోరిన అల్లు అరవింద్

వెట్రిమారన్ దర్శకత్వంలో సూరి - విజయ్ సేతుపతి ప్రధానమైన పాత్రలను పోషించిన 'విడుదలై' తమిళనాట మార్చి 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అక్కడ ఈ సినిమా భారీ వసూళ్లతో పాటు ప్రశంసలను సైతం అందుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాను తెలుగులో 'విడుదల' పేరుతో అల్లు అరవింద్ ఈ నెల 15వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడుతూ .. "ఈ మధ్య కాలంలో ఒక కొత్త సామెత వచ్చింది .. 'లోకల్ ఈజ్ గ్లోబల్' అని. దానికి కరెక్టుగా సరిపోయే సినిమానే ఇది. ఈ సినిమా తమిళ వెర్షన్ ను చూస్తూ క్లాప్స్ కొట్టకుండా ఉండలేకపోయాను. ఈ సినిమా కోసం సూరి ఎంత కష్టపడ్డాడనేది నాకు అర్థమైంది" అన్నారు. 

"వెట్రి మారన్ సినిమాలంటే నాకు ఇష్టం .. ఆయన నుంచి చాలా హిట్లు వచ్చాయి. అయినా ఆయన చాలా సింపుల్ గా ఉంటారు. గెడ్డం పెంచుకుని రోడ్డుపై వెళుతున్న ఆయనను చూస్తే వెట్రి మారన్ అంటే ఎవరూ నమ్మరు. అసలు ఆయనకి డబ్బుపై కోరిక ఉందా? లేదా? అనిపిస్తూ ఉంటుంది. అలాంటి ఆయన నుంచి మరో మంచి సినిమా వచ్చింది. దీనిని జనంలోకి తీసుకువెళ్లమని నేను ప్రెస్ ను రిక్వెస్ట్ చేస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చారు. 

Soori
Vijay Sethupathi
Bhavani Sri
Vidudala Movie
  • Loading...

More Telugu News