: గాంథీల కుటుంబాన్ని విమర్శిస్తే సహించేది లేదు: శ్రీధర్ బాబు
టీఆర్ఎస్ పార్టీపై మంత్రి శ్రీధర్ బాబు విరుచుకుపడ్డారు. తెలంగాణలో ఉద్యమ పార్టీగా ఓట్లు, సీట్లకోసం ముందుకు పోతున్నారు, మంచిదే కానీ ముందుగా సరిగ్గా వ్యవహరించడం నేర్చుకోవాలని సూచించారు. "2009లో ఒంటరిగా పోటీ చేసి గెలిచాం, కాగా ముందుముందు ఎవరు దద్దమ్మలో, ఎవరు కాదో తెలుస్తుంది. మరి, కొద్ది రోజుల్లో ఎవరేంటో ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం" అని సవాలు విసిరారు. 2014 ఎన్నికలను ఎర చూపి, పార్టీలోకి వస్తే గెలిపిస్తామని చాలామందిని ఆకర్షిస్తున్నారన్నారు. గాంధీల కుటుంబం గురించి కామెంట్ చేసే స్థాయి టీఆర్ఎస్ పార్టీకి లేదని తెలిపిన శ్రీధర్ బాబు, దేశం కోసం త్యాగం చేసిన ఆ కుటుంబాన్ని విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు.