Dr BR Ambedkar Konaseema District: కోనసీమ జిల్లాలో దారుణం.. బాలికను గర్భవతిని చేసిన పాస్టర్

Pastor made minor girl as pregnant

  • 17 ఏళ్ల తల్లిలేని బాలికను లోబరుచుకున్న పాస్టర్
  • గత నెల 5న మగబిడ్డకు జన్మనిచ్చిన బాధితురాలు
  • నేరం బయటపడకుండా ఉండేందుకు బిడ్డను మాయం చేసిన పాస్టర్

ప్రార్థనలు చేస్తూ అందరికీ సాంత్వన చేకూర్చాల్సిన పాస్టర్ దారి తప్పాడు. అభం శుభం తెలియని ఒక బాలికపై దారుణానికి ఒడిగట్టాడు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రులో ఈ ఘటన చోటుచేసుకుంది. 17 ఏళ్ల తల్లి లేని బాలిక పాస్టర్ బెజవాడ హోసన్న నిర్వహించే చర్చిలో సభ్యురాలిగా ఉంది. ఆ అమ్మాయిని లోబరుచుకున్న పాస్టర్ ఆమెను గర్భవతిని చేశాడు. ఆమెకు పుట్టిన బిడ్డను మాయం చేశాడు. 

గత నెల 5న బాధితురాలు మగ బిడ్డకు జన్మనిచ్చింది. తన నేరం బయటపడకుండా ఉండేందుకు బిడ్డను ఆయన మాయం చేశాడు. నెల రోజులు గడుస్తున్నా బిడ్డ ఆచూకీ దొరక్క పోవడంతో... బిడ్డను అమ్మేయడమో, చంపేయడమో చేసి ఉంటాడని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు బాధితురాలికి న్యాయం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. పుట్టిన బిడ్డ ఏమయ్యాడో దర్యాప్తు చేయాలని కోరుతున్నారు. ఈ ఘటన చుట్టుపక్కల ప్రాంతాల్లో సంచలనంగా మారింది.

Dr BR Ambedkar Konaseema District
Paster
Minor Girl
Pregnant
  • Loading...

More Telugu News