Tollywood: అదరగొడుతున్న నాగ చైతన్య ‘కస్టడీ’ ఫస్ట్ సింగిల్

Head up High single from Custody starring Naga Chaitanya out

  • హెడ్ అప్ హై అంటూ సాగే పాటను విడుదల చేసిన చిత్ర యూనిట్
  • పోలీసుల గొప్పతనాన్ని వర్ణించేలా రాసిన రామజోగయ్య శాస్త్రి
  • మే 12న విడుదల కాబోతున్న సినిమా

నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కస్టడీ’.  కృతీశెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. అరవింద్ స్వామి విలన్ పాత్రలో నటిస్తుండగా, ప్రియమణి మరో కీలక పాత్రలో కనిపించనుంది. కొన్నాళ్లుగా పరాజయాల్లో ఉన్న చైతన్య ఈ సినిమాతో మంచి విజయం అందుకోవాలని చూస్తున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. నాగ చైతన్య పవర్‌‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌‌గా నటిస్తున్నాడు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం నుంచి  ‘హెడ్ అప్‌ హై’ అనే ఫస్ట్ సింగిల్ విడుదలైంది. 

పోలీసుల గొప్పతనాన్ని వర్ణించేలా రామజోగయ్య శాస్త్రి రాసిన పాటను యువన్ శంకర్ రాజా, అరుణ్ కౌండిన్య, అసల్ కోలర్ పాడారు. ‘సేఫ్టీ, సెక్యూరిటీకి సింబల్‌ ఈ ఖాకీరా.. లాఠీతో జర్నీ చేసే లైఫ్‌ ఎంతో లక్కీరా’ అంటూ ఫాస్ట్ బీట్ తో సాగే పాటకు చైతన్య హుషారైన స్టెప్పులతో అలరించాడు. పోలీస్ స్టేషన్‌ బ్యాక్‌డ్రాప్‌లో నాగచైతన్యపై చిత్రీకరించిన ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ఈ చిత్రం మే 12న సినిమా విడుదల కానుంది.

More Telugu News