Simha: రానా చీఫ్ గెస్టుగా 'ఉస్తాద్' టీజర్ లాంచ్ ఈవెంట్!

Ustaad movie teaser released

  • సింహా కోడూరి హీరోగా రూపొందిన 'ఉస్తాద్'
  • రేపు ఉదయం 9:30 గంటలకు టీజర్ రిలీజ్ 
  • దర్శకుడిగా ఫణిదీప్ పరిచయం 
  • కథానాయికగా అలరించనున్న కావ్య  

కీరవాణి తనయుడు సింహా కోడూరి హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయింది. 'మత్తువదలరా' .. 'తెల్లవారితే గురువారం' .. 'దొంగలున్నారు జాగ్రత్త' వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. కుదురుగా కనిపించే సింహా, కుర్ర హీరోలకు గట్టి పోటీనిచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ఉస్తాద్' రెడీ అవుతోంది. వారాహి బ్యానర్లో నిర్మితమవుతున్న ఈ సినిమాతో, ఫణిదీప్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు .. వేదికను సెట్ చేశారు. 

హైదరాబాద్ - ఆర్కే సినీ ప్లెక్స్ లో రేపు (బుధవారం) ఉదయం 9:30 గంటలకు ఈ సినిమా టీజర్ ను రానాతో లాంచ్ చేయించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. సింహా కోడూరి జోడీగా ఈ సినిమాలో కావ్య కల్యాణ్ రామ్ కనిపించనుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.

More Telugu News