Nani: తగ్గని 'దసరా' దూకుడు .. 110 కోట్లకి పైగా వసూళ్లు!

Dasara Movie Update

  • క్రితం నెల 30వ తేదీన వచ్చిన 'దసరా'
  • ఇంతవరకూ 110 కోట్లకి పైగా గ్రాస్ వసూలు
  • యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 2 మిలియన్ ప్లస్ గ్రాస్ 
  • ఈ నెల 14వరకూ 'దసరా'కి ఢోకా లేనట్టే

నాని పక్కా మాస్ కంటెంట్ ను ఎంచుకుని చేసిన సినిమానే 'దసరా'. మొదటి నుంచి కూడా ఈ సినిమా ఎప్పటికప్పుడు బజ్ పెంచుకుంటూ వచ్చింది. కీర్తి సురేశ్ కూడా పూర్తి మాస్ లుక్ తో కనిపించడం ఆసక్తిని రేకెత్తించింది. క్రితం నెల 30వ తేదీన విడుదలైన ఈ సినిమా, భారీ ఓపెనింగ్స్ తో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. 

విడుదలైన వారం రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఆ తరువాత వారంలో రవితేజ 'రావణాసుర' .. కిరణ్ అబ్బవరం 'మీటర్' సినిమాలు థియేటర్లలో దిగిపోయాయి. దాంతో 'దసరా' వసూళ్లపై ప్రభావం పడే అవకాశం ఉందని అంతా అనుకున్నారు. 

కానీ ఆ సినిమాలు రెండూ కూడా ప్రేక్షకులను నిరాశపరిచాయి. దాంతో సహజంగానే థియేటర్లలో 'దసరా'నే కొనసాగుతోంది. ఇంతవరకూ ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 110 కోట్లకి పైగా గ్రాస్ ను రాబట్టింది. అలాగే యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 2 మిలియన్ ప్లస్ గ్రాస్ ను రాబట్టిన సినిమాగా నిలిచింది. ఇక 'శాకుంతలం' రిలీజ్ వరకూ 'దసరా'కు ఢోకా లేనట్టే. 

More Telugu News