Sai Tej: ఇక్కడ ఎవరికైనా చావుకి ఎదురెళ్లే దమ్ముందా?: 'విరూపాక్ష' ట్రైలర్ డైలాగ్ !

Virupksha Trailer Released

  • అంచనాలు పెంచుతున్న 'విరూపాక్ష'
  • గిరిజన గూడెం నేపథ్యంలో సాగే కథ 
  • సాయితేజ్ సరసన సందడి చేయనున్న సంయుక్త మీనన్ 
  • ఈ నెల 21న నాలుగు భాషల్లో విడుదల 

సాయితేజ్ హీరోగా కార్తీక్ వర్మ దండు 'విరూపాక్ష' సినిమాను రూపొందించాడు. అడవీ ప్రాంతానికి సమీపంలోని ఓ గిరిజన గూడెం నేపథ్యంలో నడిచే కథ ఇది. బీవీఎస్ ఎన్ కుమార్ - సుకుమార్ కలిసి నిర్మించిన ఈ సినిమాకి, అజనీశ్ లోక్ నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించాడు. సాయితేజ్ జోడీగా ఈ సినిమాలో సంయుక్త మీనన్ అలరించనుంది.

ఈ సినిమాను ఈ నెల 21వ తేదీన తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. 

'గ్రహణం విడిచేలోగా ఊరు అంతమైపోతుంది' .. 'జరుగుతున్న చావులకు కారణం తెలుసుకుని తీరతాను' .. 'ఇక్కడ ఎవరికైనా చావుకి ఎదురెళ్లే దమ్ముందా' అనే డైలాగ్స్ సినిమాపై మరింతగా ఆసక్తిని పెంచుతున్నాయి చాలా గ్యాప్ తరువాత వస్తున్న సాయితేజ్ కి, ఈ సినిమా హిట్ ఇస్తుందేమో చూడాలి. 

More Telugu News