Salman Khan: అంచనాలు పెంచేస్తున్న 'కిసీ కా భాయ్ .. కిసీ కి జాన్' ట్రైలర్!

Kisi Ka Bhai Kisi Ki Jaan trailer released

  • సల్మాన్ తాజా చిత్రంగా 'కిసీ కా భాయ్ .. కి సీ కి జాన్' 
  • ఆయన సొంత బ్యానర్లో నిర్మితమైన భారీ సినిమా ఇది 
  • పవర్ఫుల్ రోల్ పోషించిన జగపతిబాబు 
  • 'ఈద్' కానుకగా ఈ నెల 21న సినిమా విడుదల

సల్మాన్ ఖాన్ తాజా చిత్రంగా ప్రేక్షకులను పలకరించడానికి 'కిసీ కా భాయ్  ..  కి సీ కి జాన్' రెడీ అవుతోంది. సల్మాన్ ఖాన్ సొంత బ్యానర్లో నిర్మితమైన భారీ బడ్జెట్ సినిమా ఇది. అందుకు తగినట్టుగానే భారీ తారాగణం కనిపిస్తోంది. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, ఈ నెల 21వ తేదీన పాబీన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. 

ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. కామెడీ .. యాక్షన్ సన్నివేశాలకు ప్రాధాన్యతనిస్తూ, ప్రధానమైన పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. సల్మాన్ .. వెంకీ  .. జగపతిబాబు పాత్రలను హైలైట్ చేస్తూ ఈ ట్రైలర్ ను వదిలారు. 

ఈ సినిమాలో విలన్ గా జగపతిబాబు విజృంభించినట్టుగా ఈ ట్రైలర్ ను బట్టి తెలుస్తోంది. చూస్తుంటే పూజ హెగ్డే పాత్రను డిఫరెంట్ గా డిజైన్ చేసినట్టుగా అనిపిస్తోంది. ట్రైలర్ ద్వారా చాలా కథను చెప్పే ప్రయత్నం చేశారు. పూజ చేతిలోని ఓ అలంకరణ వస్తువు సల్మాన్ చేయితగిలి పడిపోయి పగిలిపోతుంది. 'అయ్యో అది నాలుగొందల సంవత్సరాల క్రితం నాటిది' అంటూ బాధ పడుతుంది పూజ. 'పోన్లే నేను ఇంకా కొత్తదేమో అనుకున్నాను' అంటూ సల్మాన్ కూల్ గా చెప్పిన డైలాగ్ ట్రైలర్ కి హైలైట్.

More Telugu News