Silk Smitha: సిల్క్ స్మిత విషయంలో ఏం జరిగిందంటే: సీనియర్ నటి కాకినాడ శ్యామల

Kakinada Shyamala Interview

  • సిల్క్ స్మిత చాలా మంచిదన్నా కాకినాడ శ్యామల  
  • అప్పుల నుంచి సిల్క్ స్మిత బయటపడిందని వెల్లడి 
  • ఆమె మరణం గురించి ఆ దేవుడికే తెలియాలని వ్యాఖ్య 

తెలుగు తెరపై మత్తుకళ్ల సుందరిగా సిల్క్ స్మితకి పేరు ఉంది. ఆమె చనిపోయి చాలాకాలం అవుతున్నా ఇంతవరకూ ఎవరూ మరిచిపోలేదు. అంతగా ఆమె తన హావభావాలతో .. గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అలాంటి సిల్క్ స్మిత గురించి తాజా ఇంటర్వ్యూలో కాకినాడ శ్యామల ప్రస్తావించారు. నటిగా .. నిర్మాతగా .. ఫైనాన్షియర్ గా కాకినాడ శ్యామలకి మంచి పేరు ఉంది. 

తాజా ఇంటర్వ్యూలో ఆమె సిల్క్ స్మిత గురించి చెబుతూ "నేను చాలా సినిమాలకు ఫైనాన్స్ చేశాను. అలాగే సిల్క్ స్మిత సొంత సినిమాకి కూడా ఫైనాన్స్ చేశాను. అయితే ఆ సినిమా సరిగ్గా ఆడకపోవడం వలన, సిల్క్ స్మిత అప్పులపాలైంది. అలాగని చెప్పేసి ఆమె ఎవరికీ డబ్బులు ఎగ్గొట్టలేదు. అందరికీ కూడా ఇవ్వవలసిన డబ్బులు ఇచ్చేసింది. ఆ తరువాత కొన్ని రోజులకు తిరిగి ఆమె కెరియర్ గాడిన పడింది. అలాంటి సమయంలోనే ఆమె చనిపోయిందనే వార్త విన్నాను'' అని అన్నారు. 

"సిల్క్ స్మిత వ్యక్తిత్వం చాలా గొప్పది. తెరపై ఆమె వేసే పాత్రలు వేరు .. బయట మనకి కనిపించే స్మిత వేరు. ఆమె మంచి మనసున్న మనిషి  .. నిజాయతీ ఉన్న మనిషి. ఆమెను హత్య చేశారని కొంతమంది అంటారు. లేదు .. ఆత్మహత్య చేసుకుందని మరికొందరు అంటారు. నిజానికి ఏం జరిగిందనేది ఆ పైవాడికి మాత్రమే తెలియాలి. ఆయన దృష్టిలో నుంచి ఎవరూ తప్పించుకోలేరు కదా?" అంటూ చెప్పుకొచ్చారు. 

Silk Smitha
Kakinada Shyamala
Actress
Tollywood
  • Loading...

More Telugu News