Venkatesh Daggubati: 'రానా నాయుడు' ఎవరికీ నచ్చకపోతే ట్రెండింగులో నెంబర్ వన్ గా ఎలా నిలిచింది?: నవదీప్

Navadeep Interview

  • 'రానా నాయుడు' గురించి స్పందించిన నవదీప్ 
  • ముందున్న జనరేషన్ కి అది నచ్చకపోవచ్చని వ్యాఖ్య 
  • తనలాంటివారు ఎంజాయ్ చేశారని వెల్లడి 
  • ఎవరికీ నచ్చకపోతే ఎలా ట్రెండింగ్ లోకి వెళ్లిందని ప్రశ్న 
  • ముంబై నేపథ్యంలో కథ జరిగిందనేది మరిచిపోకూడదన్న నవదీప్

వెంకటేశ్ - రానా ప్రధానమైన పాత్రలను పోషించిన 'రానా నాయుడు' వెబ్ సిరీస్, అనేక విమర్శలను మూటగట్టుకుంది. వెంకటేశ్ వంటి క్లీన్ ఇమేజ్ ఉన్న హీరో, ఇలాంటి రోల్ చేయడమేంటి? అనే ప్రశ్న ఎక్కువగా వినిపించింది. ఇలాంటి ఒక పాత్రను వెంకటేశ్ గానీ .. రానా గాని చేసి ఉండకూడదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తాజాగా సుమన్ టీవీ ఇంటర్వ్యూలో 'రానా నాయుడు' గురించిన ప్రశ్న, నవదీప్ కి ఎదురైంది. 

అప్పుడు నవదీప్ స్పందిస్తూ .. "ఇంతకుముందున్న జనరేషన్ వారికి ఈ వెబ్ సిరీస్ నచ్చకపోవచ్చు. కానీ మా జనరేషన్ వారు ఈ వెబ్ సిరీస్ ను సరదాగా చూస్తున్నారు .. ఎంజాయ్ చేస్తున్నారు. మీకు నచ్చలేదని మీరు అంటున్నారు ఓకే. అలాగే నాలాగా ఈ వెబ్ సిరీస్ ను ఎంజాయ్ చేసేవాళ్లు కూడా కొన్ని కోట్ల మంది ఉంటారు. అలా ఉండటం వలన .. చూడటం వల్లనే కదా అది ట్రెండింగులో నెంబర్ వన్ గా ఉందని నేను అంటున్నాను .. ఇక చర్చ ఏముంటుంది?" అన్నాడు. 

"మాకు నచ్చలేదు .. మాకు నచ్చలేదు అని మీరు అంటున్నారు. ఎందుకు నచ్చలేదు అని నేను అడగడం లేదు. నాలాంటి వారికి ఎందుకు నచ్చిందనేది మాత్రమే నేను చెబుతున్నాను. మీరు వ్యక్తం చేసే అభ్యంతరాలను నేను కొట్టిపారేయడం లేదు. కాకపోతే మేము అంత దూరం ఆలోచన చేయలేదు. అది ముంబై నేపథ్యంలో జరిగిన కథ గనుక, అక్కడి కల్చర్ ఎలా ఉంటుందో తెలుసును గనుక మేము సరదాగా చూశామంతే" అంటూ చెప్పుకొచ్చాడు. 

More Telugu News