dasara movie: ‘దసరా’ బరాత్‌ డ్యాన్స్‌ కోసం 25 టేకులు.. కీర్తి సురేశ్​ కష్టానికి ఫలితం!

keerti suresh took 25 takes for teenmar dance in dasra

  • నాని సరసన దసరాలో నటించిన కీర్తి
  • వెన్నెల పాత్రలో జీవించిన యువ హీరోయిన్
  • పెళ్లి బరాత్ పాటలో ఆమె హుషారు స్టెప్పులకు అభిమానులు ఫిదా

నాని, కీర్తి సురేశ్ కాంబినేషన్ లో వచ్చిన దసరా చిత్రం భారీ విజయం సొంతం చేసుకుంది. బొగ్గుగనుల బ్యాక్ డ్రాప్ లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ముఖ్యంగా నాని, కీర్తి సురేశ్ తెలంగాణ సంప్రదాయాలు, యాసతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో వెన్నెల పాత్రలో కీర్తి సురేశ్ జీవించింది. మాస్ సినిమాలో ఆమె నటనతో పాటు ఊర మాస్ డ్యాన్స్ అభిమానులను ఫిదా చేసింది. పెళ్లి బరాత్ లో ఆమె వేసిన తీన్మార్ స్టెప్పుల వీడియో వారం రోజులుగా యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. 

ఈ బీట్ లో ఒకే సీక్వెన్స్, టెంపోలో డ్యాన్స్ చేసేందుకు కీర్తి చాలా కష్టపడింది. ఏకంగా 25 టేకులు తీసుకున్న అదే ఎనర్జీతో డ్యాన్స్ చేసిందని దర్శకుడు శ్రీకాంత్ చెప్పాడు. చిన్నమిస్టేక్ కనిపించినా.. మళ్లీ చేస్తానంటూ కీర్తి ప్రాణం పెట్టి నృత్యం చేసిందని తెలిపాడు. సినిమా, నటన పట్ల ఆమెకు ఎంత అంకితభావం ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ బరాత్ వీడియోకు అద్భుత స్పందన రావడంతో కీర్తి కష్టానికి ఫలితం దక్కినట్టయింది. కాగా, మార్చి 30న విడుదలైన దసరా వారంలోనే వంద కోట్ల క్లబ్ లో చేరింది.

More Telugu News