Sai Tej: 'విరూపాక్ష' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఖరారు .. వేదిక ఎక్కడంటే ..!

Virupaksha Pre Release Date Confirmed

  • సాయితేజ్ హీరోగా రూపొందిన 'విరూపాక్ష'
  • ఆసక్తిని రేపుతూ వచ్చిన అప్ డేట్స్ 
  • రేపు ఉదయం రిలీజ్ కానున్న ట్రైలర్ 
  • ఈ నెల 16వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • 21వ తేదీన సినిమా విడుదల  

సాయితేజ్ హీరోగా 'విరూపాక్ష' సినిమా రూపొందింది. బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. ప్రమాదం నుంచి కోలుకున్న తరువాత సాయితేజ్ చేసిన ఫస్టు మూవీ ఇది. ఆయన సరసన నాయికగా సంయుక్త మీనన్ అలరించనుంది. ఈ నెల 21వ తేదీన ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. 

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు. అందులో భాగంగానే ఈ నెల 16వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును నిర్వహించనున్నారు. అందుకు ఏలూరులోని 'సీఆర్ రెడ్డి కాలేజ్' వేదిక కానుంది. ఆ రోజున సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుక మొదలు కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేశారు. 

ఇక రేపు ఉదయం 11:07 నిమిషాలకు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా కొంతసేపటి క్రితం వదిలారు. ఇంతవరకూ వదిలిన అప్ డేట్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచుతూ వచ్చాయి. ప్రమాదం కారణంగా గ్యాప్ తీసుకున్న సాయితేజ్, ఈ సినిమాతో హిట్ కొట్టాలని మెగా ఫ్యాన్స్ భావిస్తున్నారు. వాళ్ల నిరీక్షణ ఫలిస్తుందేమో చూడాలి.

More Telugu News