Venkatesh Daggubati: పాన్ ఇండియా దిశగా కదులుతున్న వెంకీ 'సైంధవ్'

Saindhav Movie Update

  • శైలేశ్ కొలను నుంచి యాక్షన్ థ్రిల్లర్
  • డిఫరెంట్ లుక్ తో కనిపించనున్న వెంకీ 
  • కథానాయికగా శ్రీనిధి శెట్టి పరిచయం 
  • పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేసే ఆలోచన  

వెంకటేశ్ కథానాయకుడిగా వచ్చిన 'ఎఫ్ 3' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ తరువాత ఆయన 'ఓరి దేవుడా' సినిమాలో అతిథి పాత్రలో కనిపించారు. ఇటీవలే వెంకీ చేసిన 'రానా నాయుడు' వెబ్ సిరీస్ కూడా డిజిటల్ ఫ్లాట్ ఫామ్ వేదికగా ప్రేక్షకులను పలకరించింది. ఆయన తాజా చిత్రంగా రూపొందిన బాలీవుడ్ మూవీ 'కిసీ కా భాయ్ కిసీ కీ జాన్' సినిమా కూడా ఈ నెల 21వ తేదీన థియేటర్లకు రానుంది. 

'రానా నాయుడు' ద్వారా ఇతర భాషల వారికి కూడా వెంకటేశ్ తెలిశారు. ఇక ఇప్పుడు సల్మాన్ కథానాయకుడిగా నటించిన కిసీ కా భాయ్' కిసీ కీ జాన్' ద్వారా కూడా ఆయన ఇతర భాషల వారికీ ఒక రేంజ్ లోనే కనెక్ట్ కానున్నారు. అందువలన తెలుగులో ఆయన తాజా చిత్రమైన 'సైంధవ్'ను కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే ఒక టాక్ బలంగా వినిపిస్తోంది. 

'హిట్ 2' సినిమాతో సక్సెస్ ను సాధించిన శైలేశ్ కొలను,'సైంధవ్' సినిమాను రూపొందిస్తున్నాడు. వెంకట్ బోయనపల్లి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. వెంకీ లుక్ .. యాక్షన్ తో కూడిన అప్ డేట్స్ ఆసక్తిని పెంచుతున్నాయి. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి శ్రీనిధి శెట్టి పరిచయమవుతుండటం విశేషం. 

More Telugu News