Shruti Haasan: సీనియర్ హీరోలతో నటిస్తుండడం పట్ల విమర్శలు... శృతి హాసన్ స్పందన

Shruti Haasan reacts to criticism

  • బాలకృష్ణ, చిరంజీవి చిత్రాల్లో నటించిన శృతి హాసన్
  • విమర్శలను ప్రశంసలుగా భావిస్తానన్న శృతి
  • బాలయ్య, చిరు లెజెండ్స్ అని వెల్లడి
  • ఏజ్ గ్యాప్ బాలీవుడ్ లోనూ ఉందని వివరణ

ప్రముఖ హీరోయిన్ శృతి హాసన్ ఇటీవల తెలుగులో సీనియర్ కథానాయకుల పక్కన నటిస్తోంది. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రాల్లో శృతి హాసనే హీరోయిన్. అయితే పెద్ద వయసు ఉన్న హీరోల పక్కన నటిస్తుండడం పట్ల శృతి హాసన్ పై విమర్శలు వస్తున్నాయి. దీనిపై శృతి హాసన్ స్పందించింది. 

ఆ విమర్శలను తాను ప్రశంసలుగానే భావిస్తానని తెలిపింది. చిరంజీవి, బాలకృష్ణ ఇద్దరూ లెజెండ్స్ అని, అలాంటి వారితో నటించే అవకాశం వస్తే ఎందుకు కాదనాలని ప్రశ్నించింది. పైగా, మంచి పాత్రలు లభించాయని వెల్లడించింది. హీరోలకు, తనకు మధ్య వయసు వ్యత్యాసం పెద్దగా పట్టించుకోనక్కర్లేదని, అందరూ మాట్లాడుకునే బాలీవుడ్ లోనూ ఏజ్ గ్యాప్ ఉంటుందని శృతి పేర్కొంది. 

తనను అందరూ ఇంకా చిన్న పిల్లలాగానే చూస్తున్నారని, అందుకు సంతోషిస్తున్నానని తెలిపింది. వయసు తేడా గురించి చేసే విమర్శలను తాను పట్టించుకోబోనని స్పష్టం చేసింది.

Shruti Haasan
Age Gap
Senior Heroes
Chiranjeevi
Balakrishna
Tollywood
  • Loading...

More Telugu News