Corona Virus: గత 24 గంటల్లో దేశంలో నమోదైన కరోనా కేసుల వివరాలు

Corona cases daily update

  • భారత్ లో మళ్లీ అధికమవుతున్న కరోనా కేసులు
  • తాజాగా 5,357 మందికి పాజిటివ్
  • అదే సమయంలో 11 మంది మృతి
  • భారత్ జనాభాతో పోల్చితే కరోనా వ్యాప్తి ఆందోళనకరమేమీ కాదన్న వైద్యులు

భారత్ లో మరోసారి కరోనా వైరస్ వ్యాప్తి ఊపందుకుంది. గత కొన్నిరోజులుగా రోజువారీ కరోనా కేసుల సంఖ్య 5 వేలకు పైన నమోదవుతోంది. గడచిన 24 గంటల్లో భారత్ లో 5,357 కొత్త కేసులు గుర్తించారు. అదే సమయంలో 11 మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. 

కాగా, భారత్ జనాభాతో పోల్చితే, ఇప్పుడు నమోదవుతున్న కేసుల సంఖ్య ఆందోళనకరమేమీ కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే కరోనా పరీక్షల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇతర దేశాలతో పోల్చితే భారత్ లో పరిస్థితి మెరుగ్గానే ఉన్నట్టు భావించాలని ముంబయి కోకిలాబెన్ అంబానీ ఆసుపత్రి వైద్య నిపుణులు డాక్టర్ తను సింఘాల్ వెల్లడించారు. 

భారత్ లో ప్రస్తుతం ప్రతి 10 లక్షల జనాభాకు కేవలం 2 కరోనా పాజిటివ్ కేసులు మాత్రమే నమోదవుతున్నాయి. జనాభా ప్రాతిపదికన చూస్తే న్యూజిలాండ్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా దేశాల్లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది.

Corona Virus
Positive Cases
Update
India
  • Loading...

More Telugu News