PS-2: పొన్నియిన్ సెల్వన్-2 నుంచి వీర రాజ వీర సాంగ్ విడుదల

Veera Raja Veera song from PS 2 out now

  • మణిరత్నం దర్శకత్వంలో పీఎస్-2
  • తాజాగా జయం రవి సాంగ్ రిలీజ్
  • ఏఆర్ రెహమాన్ బాణీలకు చంద్రబోస్ సాహిత్యం
  • ఆలపించిన శంకర్ మహాదేవన్, చిన్మయి శ్రీపాద

మణిరత్నం దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న పొన్నియిన్ సెల్వన్-2 చిత్రం నుంచి మరో అద్భుతమైన గీతం రిలీజ్ అయింది. జయం రవిని కీర్తిస్తూ సాగే ఈ పాటకు ఏఆర్ రెహమాన్ బాణీలు అందించగా, చంద్రబోస్ సాహిత్యం సమకూర్చారు. శంకర్ మహాదేవన్, చిన్మయి శ్రీపాద ఆలపించారు. 

క్లాసికల్ టచ్ తో ఆకట్టుకునేలా ఉన్న ఈ గీతంలో జయం రవితో పాటు శోభిత ధూళిపాళ్లను కూడా చూడొచ్చు. జయం రవికి స్వాగతం పలుకుతూ శోభిత నాట్యం చేసే ఇతివృత్తంతో ఈ పాటను చిత్రీకరించినట్టు తెలుస్తోంది. 

ఈ చిత్రంలో విక్రమ్, కార్తీ, ఐశ్వర్య రాయ్, త్రిష, జయం రవి, శోభిత ధూళిపాళ్ల, ఐశ్వర్య లక్ష్మి, ప్రభు, ప్రకాశ్ రాజ్, రహమాన్, శరత్ కుమార్, విక్రమ్ ప్రభు, పార్థిబన్ తదితరులు నటించారు. 

సీనియర్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్-1 (పీఎస్-1) తమిళనాట ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా పీఎస్-2 వస్తోంది. 

More Telugu News