shiva nirvana: ఈ ‘ఖుషి’లోనూ అంతే ఫీల్ ఉంటుంది: డైరెక్టర్ శివ నిర్వాణ

director shiva nirvana explains about kushi title

  • ఖుషి సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందన్న శివ నిర్వాణ
  • విజయ్ దేవరకొండ తన పాత్రకు జీవం పోశారని వెల్లడి
  • సమంత, విజయ్ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుందని వ్యాఖ్య

‘నిన్ను కోరి’ సినిమాతో దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు శివ నిర్వాణ. మజిలీ, టక్ జగదీశ్ లాంటి చిత్రాల తర్వాత ప్రస్తుతం విజయ్ దేవరకొండ, సమంత ప్రధాన పాత్రల్లో ‘ఖుషి’ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఖుషి అనే టైటిల్ పెట్టడం, సమంత, విజయ్ నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పలు విశేషాలను శివ నిర్వాణ పంచుకున్నారు. ‘ఖుషి’ అనే పేరు పెట్టడానికి కారణాన్ని వెల్లడించారు. 

ఖుషి సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని శివ నిర్వాణ వెల్లడించారు. మజిలీ సినిమా కోసం సమంతతో కలిసి పని చేశానని చెప్పారు. ఖుషి కథ రాసుకున్న సమయంలో తన మనసులోకి వచ్చిన తొలి ఆలోచన సమంతనేనని చెప్పారు. ఆమె అయితేనే పాత్రకు న్యాయం చేయగలదని అనిపించిందని తెలిపారు.

‘‘విజయ్ దేవరకొండ తన పాత్రకు జీవం పోశాడు. ‘ఖుషీ’లో  సమంత, విజయ్ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. భావోద్వేగాలు ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంటాయి’’ అని వివరించారు. పవన్ కల్యాణ్ ‘ఖుషి’ ఫీల్ గుడ్ సినిమాగా ఎంతో ఆదరణ పొందిందని, ఈ సినిమాలో కూడా అంతే ఫీల్ ఉందని చెప్పారు. అందుకే తమ సినిమాకు ఖుషీ అనే పేరు పెట్టినట్లు వెల్లడించారు. చాలా పేర్లు అనుకున్నామని, ఖుషీ అయితేనే బాగుంటుందని అనిపించిందని చెప్పుకొచ్చారు.

shiva nirvana
kushi
Samantha
Vijay Devarakonda
Pawan Kalyan
  • Loading...

More Telugu News