Kiran Rijiju: కారును ఢీకొట్టిన ట్రక్కు... సురక్షితంగా బయటపడిన కేంద్రమంత్రి

Union Minister Kiran Rijiju escaped from accident unhurt

  • జమ్మూకశ్మీర్ లో ఘటన
  • రంబన్ జిల్లాలో కారులో వెళుతున్న కిరణ్ రిజిజు
  • లోడుతో వస్తున్న ట్రక్కు ఢీకొట్టిన వైనం
  • గాయాల్లేకుండా బయటపడిన కేంద్రమంత్రి

కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఇవాళ ఓ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. జమ్మూకశ్మీర్ లో ఆయన ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు బలంగా ఢీకొట్టింది. రంబన్ జిల్లా బనిహాల్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. కిరణ్ రిజిజు వాహనం ఉదంపూర్ సమీపంలో వెళుతుండగా, లోడుతో వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. 

వెంటనే స్పందించిన భద్రతా సిబ్బంది కారు డోర్లు తెరిచి కేంద్రమంత్రిని వెలుపలికి తీసుకువచ్చారు. ఆయనకు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఓ న్యాయసేవా కార్యక్రమంలో పాల్గొనేందుకు కిరణ్ రిజిజు నేడు జమ్మూకశ్మీర్ వచ్చారు.

More Telugu News