Ram Charan: మాల్దీవులకు పయనమైన రామ్ చరణ్, ఉపాసన... ఫొటోలు ఇవిగో!

Ram Charan and his wife Upasana leaves for Maldives

  • విహారయాత్ర కోసం విదేశాలకు గ్లోబల్ స్టార్
  • హైదరాబాదు ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చిన రామ్ చరణ్, ఉపాసన
  • క్లిక్ మనిపించిన కెమెరాలు

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవలి వరకు ఫుల్ బిజీగా గడిపారు. ఆస్కార్ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ కోసం సుదీర్ఘ సమయం అమెరికాలో ఉండిపోయిన రామ్ చరణ్ ఇటీవలే స్వదేశం తిరిగొచ్చారు. అటు, శంకర్ దర్శకత్వంలో సినిమా కూడా ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. దాంతో, లభించిన విరామాన్ని సద్వినియోగం చేసుకునేందుకు రామ్ చరణ్ తన అర్ధాంగి ఉపాసనతో కలిసి విహారయాత్రకు బయల్దేరారు. ఉపాసనతో కలిసి మాల్దీవులకు వెళుతూ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దర్శనమిచ్చారు. రామ్ చరణ్, ఉపాసన కారు దిగి లాంజ్ వైపు వెళుతుండగా కెమెరాలు ఈ జోడీని క్లిక్ మనిపించాయి.

Ram Charan
Upasana
Maldives
Hyderabad
Airport
Tollywood
  • Loading...

More Telugu News