Vishwak Sen: ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి 'దాస్ కా ధమ్కీ' .. ఎప్పుడంటే..!

Daska Dhamki OTT Release Date

  • క్రితం నెల 22వ తేదీన థియేటర్స్ కి వచ్చిన 'దాస్ కా ధమ్కీ'
  • హీరోగా .. దర్శక నిర్మాతగా విష్వక్సేన్ చేసిన ప్రయోగం 
  • మంచి ఓపెనింగ్స్ ను రాబట్టిన సినిమా 
  • ఈ నెల 14వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్  

విష్వక్సేన్ బాడీ లాంగ్వేజ్ .. ఆయన డైలాగ్ డెలివరీ మాస్ ఆడియన్స్ కి తొందరగా కనెక్ట్ అయ్యేలా ఉంటాయి. ఆయన కూడా తనకి గల మాస్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకునే, కథలను .. పాత్రలను ఎంచుకుంటూ ఉంటాడు. అలా ఇటీవల ఆయన నుంచి వచ్చిన సినిమానే 'దాస్ కా ధమ్కీ'. 

విష్వక్సేన్ దర్శక నిర్మాతగా వ్యవహరించిన సినిమా ఇది. ఇందులో ఆయన ద్విపాత్రాభినయం చేశాడు. ఒకటి మాస్ రోల్ .. రెండోది క్లాస్ రోల్. అయితే ఈ రెండింటికి మధ్య వైవిధ్యాన్ని ఆయన ఆసక్తికరంగా ఆవిష్కరించలేకపోయాడనే టాక్ వచ్చింది. అయినా ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా మంచి వసూళ్లనే రాబట్టింది. 

అలాంటి ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి రెడీ అవుతోంది. ఈ నెల 14వ తేదీ నుంచి ఈ సినిమా 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు. నివేద పేతురాజ్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి, లియోన్ జేమ్స్ సంగీతాన్ని సమకూర్చాడు. హీరోగా .. విలన్ గా విష్వక్సేన్ చేసిన ఈ సినిమా, ఓటీటీ వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ ను రాబడుతుందనేది చూడాలి.

More Telugu News