pm modi: బేగంపేటకు చేరుకున్న ప్రధాని మోదీ
- స్వాగతం పలికిన తెలంగాణ గవర్నర్ తమిళిసై
- తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరు
- ప్రధానికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పిన కేంద్ర మంత్రులు, బీజేపీ రాష్ట్ర నేతలు
- బేగంపేట్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోనున్న ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ కు చేరుకున్నారు. ప్రధాని వచ్చిన ప్రత్యేక విమానం బేగంపేట ఎయిర్ పోర్టులో ల్యాండయింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున గవర్నర్ తమిళిసై, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానికి స్వాగతం పలికారు. కేంద్ర మంత్రులు, బీజేపీ రాష్ట్ర నేతలు ప్రధానికి గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు. కాసేపట్లో ప్రధాని మోదీ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు వెళ్లనున్నారు. సికింద్రాబాద్ తిరుపతి మధ్య నడిచే వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు.
ప్రధాని పర్యటన సందర్భంగా బేగంపేట్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మార్గంలో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రైల్వే స్టేషన్ లో సెక్యూరిటీ పటిష్ఠం చేశారు. ప్రయాణికులను క్షుణ్ణంగా తనిఖీ చేశాకే లోపలికి అనుమతిస్తున్నారు. ప్లాట్ ఫాం టికెట్ల జారీని అధికారులు నిలిపివేశారు. కేవలం ప్రయాణికులను మాత్రమే తనిఖీ చేసి లోపలికి పంపిస్తున్నారు. రైల్వే స్టేషన్ మొత్తం భద్రతా బలగాల అధీనంలో ఉంది.