Tollywood: అఖిల్ కు బర్త్​ డే గిఫ్ట్​ ఇచ్చిన ఏజెంట్

Akkineni Akhil Agent birthday special poster

  • మరో యాక్షన్ పోస్టర్ విడుదల
  • ఈ నెల 28న విడుదల కాబోతున్న స్పై థ్రిల్లర్
  • సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఐదు భాషల్లో వస్తున్న సినిమా

మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ చిత్రంతో కెరీర్ బెస్ట్ విజయం అందుకున్నాడు అక్కినేని యువ హీరో అఖిల్. ప్రస్తుతం అతను ఏజెంట్ చిత్రంలో నటిస్తున్నాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది ప్యాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఇది. ఇందులో సిక్స్ ప్యాక్ బాడీతో అఖిల్ సరికొత్తగా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, రెండు పాటలకు మంచి స్పందన వచ్చింది. శనివారం అఖిల్ పుట్టిన రోజు కానుకగా చిత్ర బృందం మరో పోస్టర్ ను విడుదల చేసింది. 

ఇందులో బ్లాస్ట్ అవుతున్న ఓ భవనం నుంచి అఖిల్ కిందికి దూకుతున్న యాక్షన్ ఫొటో ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్రానికి హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తుండగా మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈనెల 28న తెలుగు, హిందీ, మలయాళం, తమిళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది.

More Telugu News