Sri Leela: ఓటీటీలో శ్రీలీల ఎంట్రీ అదిరింది!

Sri Leela enters into OTT with I Love You Idiot movie
  • విరాట్, శ్రీలీల జంటగా ఐ లవ్ యూ ఇడియట్
  • తాజాగా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్
  • అలరిస్తున్న శ్రీలీల అందచందాలు, నటన
  • సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న చిత్రం
అచ్చ తెలుగు స్లిమ్ బ్యూటీ శ్రీలీలకు ప్రస్తుతం టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్, డిమాండ్ గురించి అందరికీ తెలిసిందే. ఆమె లక్కీ హ్యాండ్‌గా మారిపోయారు. ఆమె నటించిన సినిమాలు కమర్షియల్‌గా సక్సెస్ అవుతున్నాయి. విరాట్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన 'ఐ లవ్‌ యు ఇడియట్‌' సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఆహా ఓటీటీలో ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటోంది. 

ఈ చిత్రం గత ఏడాది డిసెంబర్ 17న థియేటర్లోకి వచ్చి మంచి సక్సెస్‌ను సాధించింది. ఇప్పుడు ఈ సినిమా భవానీ మీడియా సంస్థ ద్వారా 'ఆహా'లోనూ సక్సెస్ ఫుల్‌గా స్ట్రీమింగ్ అవుతోంది. 

అవి రుద్ర క్రియేషన్స్‌ బ్యానర్‌ పై  శ్రీమతి బత్తుల వసంత సమర్పణలో ఏపీ అర్జున్‌ దర్శకత్వంలో సాయి కిరణ్‌ బత్తుల, సుదర్శన్‌ గౌడ్‌ బత్తుల నిర్మాతలుగా ఈ సినిమా వచ్చింది. దర్శకుడు ఏపీ అర్జున్ కూడా నిర్మాతల్లో ఒకరిగా చిత్ర నిర్మాణంలో భాగస్వామి అయ్యారు. 

యూత్ ఫుల్ ఎంటర్టైనర్ కావడం, శ్రీలీల అందాలు, డ్యాన్సులు సినిమాకు ప్లస్‌గా మారాయి. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, విరాట్ యాక్షన్, శ్రీలీల లుక్స్ యూత్‌ను ఇట్టే కట్టిపడేశాయి. ఈ సినిమాకు హరికృష్ణ సంగీతం, పూర్ణాచారి పాటలు, అర్జున్ శెట్టి కెమెరా పనితనం కలిసి వచ్చాయి.
Sri Leela
OTT
I Love You Idiot
Aha
Virat
AP Arjun
Tollywood

More Telugu News