Somu Veerraju: కిరణ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేశాను: సోము వీర్రాజు

Will discuss about party with Kiran Kumar Reddy says Somu Veerraju

  • ఈరోజు బీజేపీలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి
  • త్వరలోనే కిరణ్ తో పార్టీ బలోపేతంపై చర్చిస్తానన్న సోము వీర్రాజు
  • ఏపీలో ప్రత్యామ్యాయ శక్తిగా ఎదుగుతామని వ్యాఖ్య

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఈరోజు బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు. పార్టీ హైకమాండ్ తనకు ఏ బాధ్యతలను అప్పగించినా స్వీకరించేందుకు తాను సిద్ధమని ఈ సందర్భంగా కిరణ్ చెప్పారు. 

మరోవైపు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ... కిరణ్ కుమార్ రెడ్డికి ఉదయం ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలియజేశానని అన్నారు. త్వరలోనే ఆయనతో సమావేశమవుతానని... ఏపీలో పార్టీ బలోపేతంపై ఆయనతో చర్చిస్తానని చెప్పారు. కిరణ్ బీజేపీలో చేరడంతో ఏపీలో పార్టీ బలోపేతమవుతుందని.... ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదిగి, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేస్తామని అన్నారు.

More Telugu News