Narendra Modi: రేపు రెండు వందేభారత్ రైళ్లను ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Modi will inaugurate two Vande Bharat trains tomorrow

  • ఏప్రిల్ 8న హైదరాబాద్ వస్తున్న మోదీ
  • సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వందేభారత్ రైలు ప్రారంభోత్సవం
  • సికింద్రాబాద్ నుంచి తిరుపతి వెళ్లనున్న వందేభారత్ రైలు
  • బీబీ నగర్ లో ఎయిమ్స్ కు మోదీ శంకుస్థాపన
  • ఐదు జాతీయ రహదారుల ప్రాజెక్టుకు శ్రీకారం

ప్రయాణికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలు రేపటి నుంచి పరుగులు తీయనుంది. ఏప్రిల్ 8న హైదరాబాద్ రానున్న ప్రధాని నరేంద్ర మోదీ ఈ వందేభారత్ రైలును ప్రారంభించనున్నారు. 

ఉదయం 11.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు చేరుకోనున్న ప్రధాని మోదీ పచ్చజెండా ఊపి ఈ సెమీ హైస్పీడ్ ట్రైన్ ను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అనంతరం, సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. తన పర్యటన సందర్భంగా బీబీ నగర్ లో నిర్మించనున్న ఎయిమ్స్ కు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత, 5 జాతీయ రహదారుల ప్రాజెక్టులకు కూడా మోదీ శంకుస్థాపన చేస్తారు. 

తన దక్షిణాది పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ రేపు చెన్నై-కోయంబత్తూరు వందేభారత్ రైలును కూడా ప్రారంభించనున్నారు. ఈ రెండు రైళ్లతో కలిపి దేశంలో నడిచే వందేభారత్ రైళ్ల సంఖ్య 13కి పెరుగుతుంది.

  • Loading...

More Telugu News