Madhya Pradesh: సోదరుడితో గొడవపడి సెల్ ఫోన్ మింగేసిన యువతి

MP girl swallows mobile

  • మధ్యప్రదేశ్ లోని భిండ్ లో ఘటన
  • సెల్ ఫోన్ విషయంలో సోదరుడితో వాగ్వాదం
  • శస్త్ర చికిత్స చేసి మొబైల్ ను బయటికి తీసిన వైద్యులు

సోదరుడితో గొడవ పడిన ఓ యువతి కోపంతో సెల్ ఫోన్ మిగేసింది. అనంతరం తీవ్ర కడుపు నొప్పితో ఆసుపత్రిలో చేరింది. వైద్యులు శస్త్ర చికిత్స చేసి యువతి పొట్టలో నుంచి సెల్ ఫోన్ ను బయటికి తీశారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని భిండ్ లో చోటు చేసుకుంది. అను అనే 18 ఏళ్ల యువతికి, ఆమె సోదరునికి మధ్య గొడవ జరిగింది. తీవ్ర వాగ్వాదం తర్వాత మనస్తాపానికి గురైన అను ఫోన్ ను అమాంతం మిగేసింది. 

కాసేపటికే తీవ్రమైన కడుపు నొప్పితో వాంతులు చేసుకుంది. దాంతో, కుటుంబ సభ్యులు ఆమెను గ్వాలియర్ లోని జయారోగ్య ఆసుపత్రికి తరలించారు. జరిగిన విషయం వైద్యులకు చెప్పారు. వైద్యులు రెండు గంటల పాటు శస్త్రచికిత్స చేసి మొబైల్ ను బయటకు తీసి ఆమె ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం అను ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.

Madhya Pradesh
cell phone
girl
swallows
  • Loading...

More Telugu News