Gopichand: 'రామబాణం' నుంచి జానపద బాణీలో హుషారెత్తించే మాస్ బీట్!

Ramabanam song released

  • గోపీచంద్ తాజా చిత్రంగా 'రామబాణం'
  • కథానాయికగా డింపుల్ హయతి సందడి
  • అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో నడిచే కథ 
  • మే 5వ తేదీన భారీస్థాయిలో విడుదల  

గోపీచంద్ - శ్రీవాస్ కాంబినేషన్లో 'రామబాణం' సినిమా రూపొందింది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో 'లక్ష్యం' .. 'లౌక్యం' సినిమాలు వచ్చాయి . ఈ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను నమోదు చేశాయి. ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందిన మూడో సినిమాగా 'రామబాణం' ప్రేక్షకులను పలకరించనుంది. 

యాక్షన్ తో పాటు అన్నదమ్ముల అనుబంధం నేపథ్యంలో ఈ కథ నడవనుంది. తాజాగా ఈ సినిమా నుంచి 'ఐ ఫోన్' సాంగ్ ను రిలీజ్ చేశారు. మిక్కీ జె మేయర్ స్వరపరిచిన ఈ పాటకి కాసర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించగా, రామ్ మిర్యాల - మోహన భోగరాజు ఆలపించారు. జానపద బాణీలో .. మాస్ బీట్ తో ఈ పాట సందడి చేస్తోంది. 

గోపీచంద్ జోడీగా డింపుల్ హయతి అలరించనున్న ఈ సినిమాలో, జగపతిబాబు ఒక కీలకమైన పాత్రను పోషించారు. మే 5వ తేదీన ఈ సినిమాను భారీస్దాయిలో రిలీజ్ చేయనున్నారు. కొంతకాలంగా హిట్ కోసం వెయిట్ చేస్తున్న గోపీచంద్ కి, ఈ సినిమాతో ఊరట లభిస్తుందేమో చూడాలి.

More Telugu News