Mohan Babu: మంచు విష్ణు వివాదంపై అడిగితే మీడియాకు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన మోహన్ బాబు, మనోజ్

Mohan Babu and Manchu Manoj retorts to media questions

  • తిరుపతిలో ఓ ప్రైవేటు ఆసుపత్రి ప్రారంభోత్సవం
  • హాజరైన మోహన్ బాబు, మంచు మనోజ్
  • రిపోర్టర్ ను తిరిగి ప్రశ్నించిన మోహన్ బాబు
  • మరో మీడియా ప్రతినిధిపై వ్యంగ్యం ప్రదర్శించిన మనోజ్

ఇటీవల మంచు విష్ణు దాడి చేస్తున్నాడంటూ మంచు మనోజ్ ఓ వీడియో విడుదల చేయడం తెలిసిందే. అయితే, తిరుపతిలో ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి మోహన్ బాబు, మనోజ్ హాజరయ్యారు. మంచు విష్ణు వివాదంపై స్పందించాలని వారిద్దరినీ మీడియా కోరగా, ఇద్దరూ తమదైన శైలిలో దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. 

మొదట మోహన్ బాబును ప్రశ్నించగా... "మీ ఇంట్లో నీకు, నీ భార్యకు ఏమిటి సంబంధం... చెప్పగలవా? తప్పయ్యా... చదువుకున్న విజ్ఞానులు మీరు" అంటూ ఆ రిపోర్టర్ కు క్లాస్ తీసుకున్నారు. ఏదైనా అడిగేందుకు సమయం, సందర్భం ఉండాలని హితవు పలికారు. తనకు మీడియా ప్రతినిధులంటే ఎంతో గౌరవం అని, ఎప్పుడు ఏది అడగాలో అదే అడిగితే బాగుంటుందని మోహన్ బాబు అన్నారు. 

మంచు విష్ణుతో వివాదంపై మనోజ్ సైతం సూటిగా సమాధానం ఇచ్చేందుకు నిరాకరించారు. ఇటీవల పరిణామాలపై స్పష్టత ఇస్తారా అని ఓ మీడియా ప్రతినిధి అడగ్గా... "భుజంపై సెగ గడ్డ లేచింది... అదే ఇటీవలి పరిణామం... వచ్చి గోకుతారా?" అంటూ వ్యంగ్యం ప్రదర్శించారు. తన జోక్ కు తానే పగలబడి నవ్వుతూ అక్కడి నుంచి నిష్క్రమించారు.

More Telugu News