Kiran Abbavaram: 'మీటర్'పై ఆధారపడిన అతుల్య రవి అదృష్టం!

Athulya Ravi Special

  • 2017లో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అతుల్య రవి 
  • సరైన బ్రేక్ కోసం కొంతకాలంగా వెయిటింగ్ 
  • 'మీటర్' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ 
  • ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్న బ్యూటీ  

టాలీవుడ్ కి ఇంతకుముందు కోలీవుడ్ భామలు చాలామంది వచ్చారు .. వస్తూనే ఉన్నారు. వాళ్లలో టాలెంట్ ఉన్నవారు ఒక రేంజ్ లో చక్రం తిప్పుతున్నారు. ఇక తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి పొలోమంటూ ఇక్కడికి వచ్చేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. తాజాగా మరో కోలీవుడ్ బ్యూటీ తెలుగు తెరకి పరిచయం కానుంది. ఆ సుందరి పేరే అతుల్య రవి.

2017లోనే అతుల్య రవి తమిళ సినిమాతో వెండితెరకి పరిచయమైంది. అప్పటి నుంచి తమిళ సినిమాలు చేస్తూనే వెళుతోంది. అయితే ఇంకా సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలోనే, 'మీటర్ ' సినిమాతో తెలుగు తెరకి పరిచయమవుతోంది. రమేశ్ దర్శకత్వంలో .. కిరణ్ అబ్బవరం జోడీగా ఆమె ఈ సినిమాలో అలరించనుంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా రేపు థియేటర్లకు దిగిపోనుంది. 

గ్లామర్ పరంగా అతుల్య రవికి వంక బెట్టవలసిన అవసరం లేదు. ఇక అభినయానికి ఎన్ని మార్కులు ఇవ్వొచ్చు అనేది సినిమా చూస్తేనే గాని తెలియదు. ఈ సినిమా ప్రమోషన్స్ లో హీరోతో పాటు ఆమె కూడా సందడి చేసింది. ఇంటర్వ్యూస్ లోను .. ఈవెంట్స్ లోను తెలుగు స్పష్టంగా మాట్లాడుతూ షాక్ ఇచ్చింది. 'మీటర్' సినిమా హిట్ కొడితే, ఈ బ్యూటీకి గట్టిగానే ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా హిట్ పడుతుందనే ఆశతో అతుల్య ఉండటం విశేషం. 

More Telugu News