Priyadarshi: అప్పట్లో పది రూపాయలు కూడా ఉండేవి కావు: కన్నీళ్లు పెట్టుకున్న 'బలగం' నారాయణ!

Muralidhar Interview

  • 'బలగం' సినిమాలో నారాయణ పాత్రలో మెప్పించిన మురళీధర్
  • పేదరికాన్ని చూశానని వివరించిన వైనం 
  • అవమానాలు పడ్డానని ఉద్వేగం   

ఇటీవల వచ్చిన 'బలగం' సినిమా అనూహ్యమైన విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులందరికీ మంచిపేరు తెచ్చిపెట్టింది. అలాంటి వారిలో నారాయణ పాత్రను పోషించిన 'మురళీధర్' ఒకరు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తన గురించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు.

"మాది మెదక్ జిల్లాలోని రామాయం పేట. మేము ఐదుగురం సంతానం. మా నాయన ఒక పెద్ద మనిషి దగ్గర జీతం చేసేవాడు. మాది చాలా పేద కుటుంబం ..  పది రూపాయలు కూడా లేని రోజులను చూశాను. ఆ పది రూపాయలు అప్పు అడగడానికి అమ్మ పడిన నామోషీ చూశాను. చిరిగిన బట్టలు వేసుకుంటే అంతా గెలిచేసేవాళ్లు" అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 

"నా చిన్నప్పుడు నేను పడిన కష్టాలు .. పడిన అవమానాలు నేను జాగ్రత్తపడేలా చేశాయి. నేను డబ్బు విలువను .. సమయం విలువను తెలుసుకోవడానికి సాయపడ్డాయి. ఇప్పటికీ కూడా పది రూపాయలు ఖర్చు చేయడానికి ఆలోచన చేస్తాను .. అవసరమైతేనే తప్ప ఖర్చు చేయను. అది పిసినారితనం కాదు .. ఎంత కష్టపడితే ఆ పది రూపాయలు వస్తాయనేది నాకు తెలుసు" అంటూ చెప్పుకొచ్చారు. 

More Telugu News