Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్ ను అరెస్ట్ చేసిన గౌలిగూడ పోలీసులు

Police arrests Raja Singh

  • ఇవాళ హనుమాన్ జయంతి
  • గోషామహల్ నియోజకవర్గంలో ర్యాలీ
  • ర్యాలీకి ముందు రాజాసింగ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • హనుమాన్ భక్తులు విధ్వంసానికి పాల్పడితే తనకు సంబంధం లేదన్న రాజాసింగ్

గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా ర్యాలీ ఏర్పాటు చేయగా.... ర్యాలీ ప్రారంభానికి ముందే రాజాసింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

అయితే, తనను ఎందుకు అడ్డుకుంటున్నారంటూ రాజాసింగ్ పోలీసులను ప్రశ్నించారు. ఇవాళ హిందువుల పండుగ అని, తన నియోజకవర్గంలో జరిగే కార్యక్రమంలో తాను పాల్గొనకుండా ఎలా ఉంటానని అన్నారు. ఇవాళ తన పుట్టినరోజు కూడా అని, తన పేరు హనుమాన్ సింగ్ అని తెలిపారు. దాంతో రాజాసింగ్ తో మాట్లాడుతున్న ఓ పోలీసు అధికారి ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. 

అటుపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఓ వీడియో సందేశం వెలువరించారు. ప్రతి ఏటా హనుమాన్ జయంతికి తన నియోజకవర్గంలో బైక్ ర్యాలీ జరుగుతుందని, ఆంజనేయస్వామి భక్తులు ఏదైనా విధ్వంసానికి పాల్పడితే తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. తనను అరెస్ట్ చేస్తే హనుమాన్ భక్తులు ఆవేశానికి గురికావొచ్చని, అందుకు తాను జవాబుదారీ కాదని అన్నారు. 

ఇటీవల రాజాసింగ్ శ్రీరామనవమి సందర్భగా నిర్వహించిన శోభాయాత్రలో ఓ వర్గం వారిని రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ కేసు నమోదైంది. ఆ కేసులో భాగంగా రాజాసింగ్ ను అరెస్ట్ చేశారు.

Raja Singh
Arrest
Police
Hanuman Jayanthi
Hyderabad
BJP
Telangana

More Telugu News