Posani Krishna Murali: ఒక నిర్మాతగా నేను పెట్టినంత మంచి భోజనం ఇండస్ట్రీలోనే ఎవరూ పెట్టలేదు: పోసాని

Posani Interview

  • తాను ఇండస్ట్రీకి వచ్చి 37 ఏళ్లు అయిందన్న పోసాని
  • ఎప్పుడూ ఎవరినీ ఇబ్బంది పెట్టలేదని వెల్లడి 
  • ఎవరినీ తక్కువగా చూడలేదని వ్యాఖ్య 
  • నిర్మాతగాను తనకి మంచి పేరుందని వివరణ

పోసాని కృష్ణమురళికి ముక్కుసూటి మనిషి అనే పేరు ఉంది. ఆయన మాటల్లో ఆవేశం కూడా కాస్త ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. తాను చదువుకునే రోజుల నుంచి ఇంతే, ఏమీ మారలేదు అంటూ తాజా ఇంటర్వ్యూలోను ఆయన తేల్చేశారు. నటుడిగా .. దర్శకుడిగా మాత్రమే కాదు, ఒకానొక దశలో ఆయన నిర్మాతగాను మారారు. 

పోసాని మాట్లాడుతూ .. " సినిమా ఇండస్ట్రీలోకి నేను అడుగుపెట్టి 37 సంవత్సరాలు. ఇంతవరకూ నేను ఏ ఒక్క మిస్టేక్ చేయలేదు. హీరో .. హీరోయిన్ .. దర్శకుడు .. నిర్మాత ఎవరినీ నేను ఏ రకంగానూ ఇబ్బంది పెట్టలేదు. రైటర్ గా ఉన్నప్పుడు రైటర్ గా .. డైరెక్టర్ గా ఉన్నప్పుడు డైరెక్టర్ గా .. నిర్మాతగా ఉన్నప్పుడు నిర్మాతగా ప్రవర్తించాను" అని అన్నారు. 

"నిర్మాతగా నేను ఒక సినిమా చేస్తే .. నేను పెట్టినంత మంచి భోజనం ఇండస్ట్రీలో ఇంతవరకూ ఎవరూ పెట్టలేదు.  ఈ విషయాన్ని గురించి మీరు ఎవరినైనా అడగొచ్చు. బ్రేక్ ఫాస్టులో కూడా రెండు నాన్ వెజ్ లు నేను పెట్టాను .. ఇంతవరకూ ఎవరైనా పెట్టారేమో కనుక్కోండి. ఆర్టిస్టులందరికీ మంచి భోజనం పెట్టి .. సమయానికి పంపించేసేవాడిని" అని చెప్పుకొచ్చారు. 

Posani Krishna Murali
Actor
Tollywood
  • Loading...

More Telugu News