Posani Krishna Murali: మెగాఫోన్ పట్టనున్న పోసాని తనయుడు!

Posani Interview

  • ప్రస్తుతం నటనపైనే దృష్టి పెట్టిన పోసాని 
  • పెద్దబ్బాయి ఉజ్వల్ కి రైటింగ్ పై మంచి పట్టు 
  • డైరెక్షన్ విభాగంలో శిక్షణ పొందిన చిన్నబ్బాయి ప్రజ్వల్

సినీ రచయితగా .. నటుడిగా .. దర్శకుడిగా పోసాని తానేమిటనేది నిరూపించుకున్నారు. ఆయన ఏం చేసినా తన మార్క్ చూపిస్తూ వచ్చారు. ప్రస్తుతం ఆయన బిజీ కేరక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతూ వెళుతున్నారు. ఆయనకి ఎంతమంది పిల్లలు .. వాళ్లు ఏం చేస్తున్నారు? అనేది చాలామందికి తెలియదు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పోసాని ఈ విషయాలను గురించి స్పందించారు.

" మా పెద్దబ్బాయి పేరు ఉజ్వల్ .. తను డిగ్రీ పూర్తి చేశాడు. హాంకాంగ్ లో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ లో నటన .. డైరెక్షన్ విభాగాల్లో శిక్షణ పొందాడు. నాకంటే కూడా కథలు బాగా చెబుతాడు .. డైలాగ్స్ కూడా చాలా బాగా రాస్తాడు. తాను ఇచ్చిన కథతోనే ప్రస్తుతం నేను ఒక సినిమా చేస్తున్నాను. వచ్చేనెలలో ఆ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాము" అన్నారు. 

"ఇక మా చిన్నబ్బాయి పేరు ప్రజ్వల్. తను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో చదివాడు. బీటెక్ చేసే సమయంలో, తనకి సినిమా ఫీల్డ్ కి రావాలని ఉందని చెప్పాడు.. లాస్ ఏంజెల్స్ వెళ్లి, అక్కడ దర్శకత్వ విభాగంలో శిక్షణ పొందాడు. ఇక్కడికి వచ్చిన తరువాత 'భరత్ అనే నేను' సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా చేశాడు. త్వరలో మెగా ఫోన్ పట్టుకోవాలనే ఉద్దేశంతో, అందుకు సంబంధించిన ఏర్పాట్లను చేసుకుంటున్నాడు " అంటూ చెప్పుకొచ్చారు. 

Posani Krishna Murali
Ujwal
Prajwal
Tollywood
  • Loading...

More Telugu News