Narendra Modi: ఎల్లుండి హైదరాబాద్‌కు మోదీ.. షెడ్యూలు ఇలా!

PM Modi to visit Hyderabad on 8th April

  • ఈ నెల 8న మోదీ హైదరాబాద్ రాక
  • సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించనున్న ప్రధాని 
  • పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, బహిరంగ సభ
  • 1.30 గంటలకు తిరిగి ఢిల్లీకి ప్రధాని

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 8న హైదరాబాద్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం బహిరంగ సభ ఉంటుంది. ఈ మేరకు ఆయన షెడ్యూలు ఖరారైంది.

8న (శనివారం) ఉదయం 11.30 గంటలకు మోదీ బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి 11.45 గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వెళ్తారు. అక్కడ సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభిస్తారు. అనంతరం 12.15 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుంటారు. 12.18 గంటల నుంచి 1.20 గంటల వరకు అక్కడ వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయడంతోపాటు పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. అనంతరం బహిరంగ సభ ఉంటుంది. ఆ తర్వాత 1.30 గంటలకు బేగంపేట నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్తారు.

Narendra Modi
Hyderabad
Vande Bharat Express
  • Loading...

More Telugu News