Nani: నెగెటివిటీ అనే చెడుపై మంచి సాధించిన గెలుపే 'దసరా': నాని

Dasara Block Buster Daawath Event

  • కరీంనగర్ వేదికగా 'దసరా' సక్సెస్ సెలబ్రేషన్స్ 
  • ఈ రోజుల్లో నెగెటివిటీ పెరిగిపోయిందన్న నాని 
  • అలాంటి చెడుపై మంచి సాధించిన విజయమే 'దసరా' అని వ్యాఖ్య 
  • ఈ సినిమాను సపోర్ట్ చేసిన స్టార్స్ కి ధన్యవాదాలు చెప్పిన నాని

నాని హీరోగా వచ్చిన 'దసరా' సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. శ్రీకాంత్ ఓదెల - సుధాకర్ చెరుకూరి దర్శక నిర్మాతలుగా వ్యవహరించిన ఈ సినిమా, వారం రోజులలోనే 100 కోట్ల వసూళ్లను రాబట్టింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ను 'కరీంనగర్'లో నిర్వహించారు. 

ఈ వేదికపై నాని మాట్లాడుతూ .. "ఇక్కడ ఈ ఎనర్జీ చూస్తుంటే నా కడుపు నిండిపోయింది. 'దసరా' సినిమాను ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసిన మీ అందరికీ థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమాకి సంబంధించి 100 కోట్ల పోస్టర్ చూడాలని శ్రీకాంత్ అనుకున్నాడు .. అనుకున్నది సాధించాడు. నేను నమ్మి చేసిన ప్రతి కథకు మీరంతా బ్రహ్మరథం పడుతున్నందుకు ఆనందంగా ఉంది" అని అన్నాడు. 

"ఈ మధ్య కాలంలో ఒక కొత్త సినిమా వస్తుంటే 'ఈ సినిమా ఆడదు చూసుకో' అనేవారు సోషల్ మీడియాలో ఎక్కువైపోయారు. ఈ నెగెటివిటీ అనే చెడుపైన ఈ రోజున మంచి గెలిచింది. 'దసరా' అంటేనే చెడుపై మంచి గెలవడం. ఆ సెలబ్రేషన్ నే ఈ రోజున మనం ఇక్కడ చేసుకున్నాం. ప్రభాస్ .. మహేశ్ బాబు .. రాజమౌళి .. సుకుమార్ గారు ఈ సినిమాను ఎంతో సపోర్ట్ చేశారు. వాళ్లందరికీ ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News