Nani: 'దసరా' 6 రోజుల వసూళ్లు ఇవే!

Dasara Movie Update

  • క్రితం నెల 30న విడుదలైన 'దసరా'
  • 6 రోజుల్లో 96 కోట్ల గ్రాస్ వసూళ్లు 
  • త్వరలో 100 కోట్ల క్లబ్ లో చేరే ఛాన్స్

మొదటి నుంచి నాని 'దసరా' సినిమాపైన గట్టి నమ్మకంతోనే ఉన్నాడు. ఆ నమ్మకానికి తగినట్టుగానే హిట్ కొట్టాడు. నాని కెరియర్లో ఆయన పాన్ ఇండియా సినిమాగా ఇది రిలీజ్ అయింది. క్రితం నెల 30వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. తొలి రోజునే 38 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసింది. 

ఇక ఈ సినిమా విడుదలై నిన్నటితో 6 రోజులైంది. ఈ 6 రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 96 కోట్ల గ్రాస్ .. 53.52 కోట్ల షేర్ ను రాబట్టింది. నాని కెరియర్ లోనే అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా ఇది నిలిచింది. 100 కోట్లకి అత్యంత చేరువగా వెళ్లింది. ఈ మార్కును ఈ సినిమా ఈ రోజున టచ్ చేసే ఛాన్స్ ఉంది. 

ఈ సినిమాలో నానీతో పాటు కీర్తి సురేశ్ పోటీపడి నటించింది. నానీ ఎంట్రీ .. ఇంటర్వెల్ బ్యాంగ్ .. క్లైమాక్స్ ఫైట్ ఈ సినిమాకి హైలైట్ గా నిలిచాయి. ఈ సినిమా తెలుగు .. తమిళ .. కన్నడ మలయాళ స్ట్రీమింగ్ హక్కులను 'నెట్ ఫ్లిక్స్' వారు, హిందీ స్ట్రీమింగ్ హక్కులను హాట్ స్టార్ వారు దక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. 

More Telugu News