Kiran Abbavaram: 'మీటర్' హిట్ .. కావాలంటే రాసిపెట్టుకోండి: కిరణ్ అబ్బవరం

Meter Pre Release Event

  • 'మీటర్' ప్రీ రిలీజ్ ఈవెంటులో కిరణ్ అబ్బవరం
  • సప్తగిరితో కలిసి తెరపై సందడి చేశానని వెల్లడి 
  • అతుల్య అంకితభావం గురించిన ప్రస్తావన
  • దర్శకుడిగా రమేశ్ కి మంచి క్లారిటీ ఉందని వ్యాఖ్య

మొదటి నుంచి కిరణ్ అబ్బవరం తన సినిమాల్లో మాస్ కంటెంట్ తప్పనిసరిగా ఉండేలా చూసుకుంటూ వస్తున్నాడు. 'మీటర్' సినిమాలో మాస్ పాళ్లు మరింత పెంచాడు. ఈ నెల 7వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుండటంతో, తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ స్టేజ్ పై కిరణ్ మాట్లాడుతూ .. "గోపీచంద్ మలినేనిగారు .. బుచ్చిబాబు గారు ఈ ఇద్దరితోను నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. ఈ ఇద్దరూ ఈ ఫంక్షన్ కి రావడం ఆనందంగా ఉంది" అని అన్నాడు. 

"ఏ సినిమా అయినా తెరపై గ్రాండ్ గా కనిపించాలంటే అందుకు కావలసింది డబ్బులు. ఈ సినిమా కథ స్థాయిని పెంచింది నిర్మాతలే .. వారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇక సప్తగిరితో కలిసి నటించడం హ్యాపీగా ఉంది. ఆయన పక్కనుంటే ఎప్పుడూ ఎనర్జీతో నవ్విస్తూనే ఉంటాడు. తెరపై మా కాంబినేషన్ చేసే అల్లరి అందరికీ నచ్చుతుంది" అని చెప్పాడు. 

"అతుల్య రవి చాల బాగా చేసింది. తనకి తెలుగు సినిమాల పాటల ఆసక్తి ఎక్కువ. చాలా తక్కువ సమయంలో తెలుగు భాషను నేర్చుకుంది. ఇక దర్శకుడు రమేశ్ విషయానికి వస్తే, ఆయన ఈ కథాకథనాలను చాలా పెర్ఫెక్ట్ గా డిజైన్ చేసుకున్నాడు. అందువలన ఎలాంటి డౌట్స్ అడగకుండా ఈ సినిమాను చేశాను. తప్పకుండా ఇది పెద్ద హిట్ అవుతుంది.. కావాలంటే రాసిపెట్టుకోండి" అని చెప్పుకొచ్చాడు. 

Kiran Abbavaram
Athulya Ravi
Meter Movie
  • Loading...

More Telugu News