Kiran Abbavaram: ఓ రవితేజ .. ఓ నాని .. ఓ కిరణ్ అబ్బవరం: గోపీచంద్ మలినేని

Meter Pre Release Event

  • 'మీటర్' ప్రీ రిలీజ్ ఈవెంటులో గోపీచంద్ మలినేని
  • కిరణ్ లో మంచి ఈజ్ ఉందని వ్యాఖ్య
  • అతుల్యకి మంచి ఫ్యూచర్ ఉందని వెల్లడి 
  • ఈ నెల 7వ తేదీన సినిమా రిలీజ్ 

ఈ మధ్యనే 'వినరో భాగ్యము విష్ణు కథ' సినిమాతో హిట్ కొట్టిన కిరణ్ అబ్బవరం, పెద్ద గ్యాప్ లేకుండానే 'మీటర్' సినిమాను ఈ నెల 7వ తేదీన థియేటర్లకు తీసుకొస్తున్నాడు. పోలీస్ ఆఫీసర్ గా కిరణ్ కనిపించనున్న ఈ సినిమాలో, ఆయన జోడీగా అతుల్య రవి అలరించనుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటులో గోపీచంద్ మలినేని మాట్లాడాడు.

"ట్రైలర్ చూస్తుంటే మాస్ ఆడియన్స్ కి కావాల్సిన అన్ని అంశాలు ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. కిరణ్ కి తనకంటూ ఒక యూనిక్ స్టైల్ ఉంది. ఆయన డైలాగ్ డెలివరీ ఆయనకి చాలా ప్లస్. ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా రవితేజ .. నాని వచ్చారు. ఆ తరువాత స్థానంలో నాకు కిరణ్ కనిపిస్తున్నాడు" అని అన్నారు. 

"కిరణ్ ఇటు డాన్సులు .. అటు ఫైట్లు మంచి ఈజ్ తో చేస్తున్నాడు. నిజంగానే ఆయనలో మంచి మాస్ మీటర్ ఉంది. ఈ సినిమాలో ఇంకాస్త హ్యాండ్ సమ్ గా కనిపిస్తున్నాడు. అతుల్య రవి విషయానికి వస్తే తను తెలుగు చాలా బాగా మాట్లాడుతోంది. ఆమెకి ఇక్కడ మంచి ఫ్యూచర్ ఉంటుందని భావిస్తున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు. 

More Telugu News