Telangana: ప్రియమైన ప్రధాని మోదీ కాదు.. పిరమైన ప్రధాని మోదీ: కేటీఆర్​ వ్యంగ్యం

KTR setires on narendra modi over Inflation

  • నిత్యావసరాల ధరల పెరుగుదలపై మోదీపై కేటీఆర్ విమర్శ
  • ఉప్పు నుంచి గ్యాస్ వరకూ అన్నీ పిరం అయ్యాయని వ్యాఖ్య
  • కవితాత్మక ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్

పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను ప్రస్తావిస్తూ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. మోదీని ప్రియమైన ప్రధాని కాదు.. పిరమైన మోదీ అనాలంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు కేటీఆర్ కవితాత్మక ట్వీట్ చేశారు. ఆయా ధరల పెరుగులదలపై వచ్చిన వార్తల క్లిప్పింగ్స్ ను ట్విట్టర్ లో షేర్ చేశారు.

కేటీఆర్ ట్వీట్ యాథాతథంగా

ఉప్పు పిరం.. పప్పు పిరం.. 
పెట్రోల్ పిరం.. డీజిల్ పిరం
గ్యాస్ పిరం..
గ్యాస్ పై వేసిన దోశ పిరం 
అన్నీ పిరం.. పిరం... 
జనమంతా గరం... గరం...
అందుకే అంటున్న
ప్రియమైన ప్రధాని... మోదీ కాదు..
“పిరమైన ప్రధాని.. మోదీ.."

Telangana
KTR
Narendra Modi
tweet
inflation

More Telugu News