Kiran Abbavaram: 'మీటర్' రిలీజ్ కాగానే అతుల్య ఫోన్ నెంబర్ అందరికీ ఇచ్చేస్తాను: సప్తగిరి

Meter Pre Release Event

  • కిరణ్ అబ్బవరం హీరోగా 'మీటర్'
  • కథానాయికగా అతుల్య రవి 
  • తెలుగులో ఆమెకి ఇదే ఫస్టు మూవీ
  • కిరణ్ పారితోషికం పెరుగుతుందన్న సప్తగిరి  
  • ఈ నెల 7వ తేదీన సినిమా రిలీజ్  

కిరణ్ అబ్బవరం హీరోగా 'మీటర్' సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ - క్లాప్ వారు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి, రమేశ్ దర్శకత్వం వహించాడు. సాయికార్తీక్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాతో, కథానాయికగా 'అతుల్య రవి' పరిచయం కానుంది. ఈ నెల 7వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంటును హైదరాబాదు .. దసపల్లా కన్వెన్షన్ లో నిర్వహించారు.

ఈ సినిమాలో సప్తగిరి ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. ఈ వేదికపై ఆయన మట్లాడుతూ .. " ఈ సినిమా కోసం కిరణ్ అబ్బవరం చాలా కష్టపడ్డాడు. ఈ సినిమా ప్రమోషన్స్ ను తన భుజాలపై వేసుకుని చాలా చోట్లకి తిరుగుతున్నాడు. ఇది ఆయన స్టామినాను నిరూపించే సినిమా అవుతుందని నేను బలంగా చెప్పగలను. ఈ సినిమా తరువాత ఆయన రెమ్యునరేషన్ 'మీటర్' ఒక రేంజ్ లో తిరగాలని కోరుకుంటున్నాను" అని అన్నాడు. 

"మన హీరోయిన్ అతుల్య రవి గురించి చెప్పడం మరిచిపోయాను. ఈ సినిమా రిలీజ్ కి ముందే చాలామంది ఆమె ఫ్యాన్స్ అయ్యారు. తమ్ముళ్లూ .. ఈ సినిమా మార్నింగ్ షో అవ్వగానే ఆమె నుంచి ఫోన్ నెంబర్ తీసుకుని మీ అందరికీ ఇచ్చేస్తాను. ఇక మీరు వాట్సాప్ చాట్ ఏ రేంజ్ లో చేసుకుంటారో చేసుకోండి" అంటూ నవ్వించాడు. 

More Telugu News