Allu Arjun: అసలు పుష్ప ఎక్కడ?.. అంటూ పుష్ప2 నుంచి అదిరిపోయే సర్​ ప్రైజ్

Big surprise from pushpa 2

  • రష్మిక మందన్న పుట్టిన రోజు సందర్భంగా 20 సెకన్ల గ్లింప్స్ విడుదల
  • ఈ నెల 7న అల్లు అర్జున్ పుట్టిన రోజున రాబోతున్న మరో సర్ ప్రైజ్ 
  • ఆ రోజు 4.05 గంటలకు టీజర్ విడుదల చేయనున్న చిత్రం

పుష్ప తొలి పార్టుతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా హీరోగా మారిపోయారు. రష్మిక మందన్న బన్నీ సరసన హీరోయిన్ గా నటించింది. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ‘పుష్ప: ద రైజ్’ దక్షిణాదితో పాటు హిందీలోనూ సూపర్ హిట్ అయింది. దాంతో, రెండో పార్టు 'పుష్ప: ద రూల్’ కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. టాకీ పార్టు చివరి దశకు వచ్చింది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. రష్మిక మందన్న పుట్టిన రోజు సందర్భంగా చిన్న వీడియో టీజర్ ను విడుదల చేసింది. అసలు పుష్ప ఎక్కడ? అంటూ 20 సెకండ్ల వీడియోతో సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.

'తిరుపతి జైలు నుంచి బుల్లెట్ గాయాలతో తప్పించుకున్న పుష్ప.. అసలు పుష్ప ఎక్కడ' అంటూ న్యూస్ వచ్చినట్లు చూపించడం.. పుష్పకు మద్దతుగా పోలీస్ డౌన్ డౌన్ అంటూ అతని అభిమానులు గొడవ చేయడం కనిపించింది. పుష్ప ఎక్కడ? అనే శోధన త్వరలోనే ముగుస్తుంది. రాజ్యం ఏలే ముందు సాగే వేట గురించి ఈ నెల 7న సాయంత్రం 4.05 గంటలకు తెలుస్తుంది అని ట్యాగ్ లైన్స్ ఇచ్చింది చిత్ర బృందం. ఈ నెల 7న బన్నీ పుట్టిన రోజు కావడంతో చిత్రం టీజర్ ను విడుదల చేస్తారని తెలుస్తోంది. అంతకుముందు రష్మికకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ ఆమె అందమైన ఫొటోను చిత్ర బృందం ట్విట్టర్ లో షేర్ చేసింది.

More Telugu News