Saitej: ప్రమాదంలో నాకు మాట పడిపోయింది తెలుసా?: సాయితేజ్

Saitej Interview

  • తనకి జరిగిన ప్రమాదం గురించి ప్రస్తావించిన సాయితేజ్ 
  • ఆ షాక్ లో మాట పోయిందని వెల్లడి 
  • ఆ సమయంలో మాట విలువ తెలిసిందని వ్యాఖ్య 
  • డైలాగ్స్ చెప్పడానికి ఇబ్బంది పడ్డానని వివరణ 
  • తన ప్రయాణం మళ్లీ మొదలైందన్న సాయితేజ్

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన సాయితేజ్ .. హీరోగా తనకంటూ కొంత ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇటు యూత్ నుంచి .. అటు మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేశాడు. అలాంటి సాయితేజ్ నుంచి కొంత గ్యాప్ తరువాత 'విరూపాక్ష' సినిమా వస్తోంది. ఈ నెల 21వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో సాయితేజ్ యాక్టివ్ గా ఉన్నాడు.

తాజాగా 'గ్రేట్ ఆంధ్ర'కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయితేజ్ మాట్లాడుతూ .. "బైక్ పై నుంచి నేను పడిపోయినప్పుడు ఆ షాక్ లో నాకు మాట పడిపోయింది. మాట పడిపోయిన తరువాత నాకు మాట విలువ తెలిసింది. ఎప్పటిలా మాట్లాడాలనే తపన ఎంతగానో ఉండేది. ఆ సమయంలో మాట్లాడానికి ట్రై చేయడనికి నేను ఎంత కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసు" అన్నాడు. 

"ఈ ప్రమాదం జరగడానికి ముందు 'రిపబ్లిక్' సినిమాలో 4 పేజీల డైలాగులను ఏకధాటిగా చెప్పాను. కానీ 'విరూపాక్ష' సినిమా షూటింగులో హాఫ్ పేజీ డైలాగులను కూడా చెప్పలేక అవస్థలు పడ్డాను. ఆ సమయంలో తోటి ఆర్టిస్టులు చాలా సపోర్ట్ చేశారు. కొన్ని సార్లు పెదాలను మాత్రమే కదిలించిన సందర్భాలు ఉన్నాయి. ప్రమాదం తరువాత హీరోగా నా జర్నీ మొదటిమెట్టు నుంచి మొదలుపెట్టినట్టుగానే ఉంది" అంటూ చెప్పుకొచ్చాడు.

More Telugu News