Hyderabad: హైదరాబాద్​ లో కాల్పుల కలకలం.. యువకుడిని కాల్చి చంపిన దుండగులు

Gun fire in Hyderabad one shot dead

  • టప్పాచబుత్రా పరిధిలోని ఓ హోటల్ సమీపంలో ఘటన
  • కాల్పుల్లో ఆకాశ్ సింగ్ అనే వ్యక్తి మృతి
  • పాత గొడవలే కారణమని భావిస్తున్న పోలీసులు

హైదరాబాద్‌ నగరంలో అర్ధరాత్రి కాల్పుల కలకలం రేగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. టప్పాచబుత్రా ప‌రిధిలోని సాబాబ్ హోట‌ల్ స‌మీపంలోని తోప్‌ఖానా వ‌ద్ద మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కార్వాన్‌కు చెందిన 26 ఏళ్ల ఆకాశ్ సింగ్ అనే కుర్రాడిపై కొందరు గుర్తు తెలియని దుండగులు పాయింట్ బ్లాంక్ రేంజ్‌ లో కాల్పులు జరిపారు. దాంతో, ఆకాశ్ అక్కడికక్కడే చనిపోయాడు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.

పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. క్రాంతి అనే యువ‌కుడికి, ఆకాశ్ కి గ‌తంలో గొడ‌వ‌లు ఉన్నాయని ఈ పని వారే చేసుంటారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎలాంటి ఉద్రిక్త ప‌రిస్థితులు త‌లెత్త‌కుండా తోప్‌ఖానా ఏరియాలో భారీగా పోలీసులను మోహ‌రించారు. దుండగులను గుర్తించేందుకు సమీపంలోని సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Hyderabad
gun fire
one dead
  • Loading...

More Telugu News