Raviteja: రవితేజ గురించి మేఘ ఆకాశ్ ఏమందంటే ..!

Megha Akash Interview

  • మేఘ ఆకాశ్ కి యూత్ లో మంచి క్రేజ్ 
  • సరైన బ్రేక్ కోసం ఆమె వెయిటింగ్ 
  • రవితేజతో చేయడం అదృష్టమన్న మేఘ 
  • తమిళంలో బిజీగానే ఉన్నానని వెల్లడి    

టాలీవుడ్ లోకి కథానాయికగా మేఘ ఆకాశ్ ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయింది. ఆరంభంలోనే ఫ్లాపులు పడినప్పటికీ, సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తూ ముందుకు వెళుతూనే ఉంది. ఆమె తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావటానికి 'రావణాసుర' రెడీ అవుతోంది. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఈ నెల 7వ తేదీన థియేటర్లకు రానుంది.

ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో మేఘ మాట్లాడుతూ .. "రవితేజ జోడీగా చేసే ఛాన్స్ రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమాలో నా పాత్ర .. నేను ఇంతవరకూ చేస్తూ వచ్చిన పాత్రలకి భిన్నంగా ఉంటుంది. రవితేజతో కలిసి ఒక పాటలో కూడా సందడి చేస్తాను. ఆయన స్పీడ్ చూసి నేను చాలా షాక్ అయ్యాను" అని చెప్పింది. 

"ప్రస్తుతం తెలుగు .. తమిళ సినిమాలు చేస్తున్నాను. తమిళంలో మూడు సినిమాలు లైన్లో ఉన్నాయి. మలయాళం నుంచి కూడా అవకాశాలు వస్తున్నాయిగానీ, డేట్స్ సర్దుబాటు కాకపోవడం వలన వదులుకోవలసి వస్తోంది. ఒకేరోజున రెండు మూడు సినిమాల షూటింగులు పెట్టుకోవడం .. హడావిడి పడిపోవడం నాకు ఇష్టం ఉండదు. నా కంఫర్టును బట్టే సినిమాలు చేస్తూ వెళతాను" అని చెప్పుకొచ్చింది. 

More Telugu News