Nara Lokesh: అంబేద్కర్ రాజ్యాంగం దమ్మేంటో నేను చూపిస్తా: లోకేశ్

Lokesh speech in Anantapur

  • అనంతపురంలో లోకేశ్ పాదయాత్ర
  • బహిరంగ సభలో ప్రసంగం
  • మన్ముందు సినిమా చూపిస్తామని వైసీపీకి హెచ్చరిక
  • సంక్షేమాన్ని పరిచయం చేసిందే టీడీపీ అని వెల్లడి

టీడీపీ అగ్రనేత నారా లోకేశ్ అనంతపురంలో చేపట్టిన యువగళం పాదయాత్రకు జనం పోటెత్తారు. అడుగడుగునా ప్రజలు నీరాజనాలతో స్వాగతం పలకడంతో అనంతపురం జనసంద్రంగా మారింది. అనంతపురంలో ఆరుగంటలపాటు పాదయాత్ర కొనసాగింది. దారిపొడవునా విచిత్ర వేషధారణలు, డప్పుల శబ్ధాలు, బాణసంచా మోతలతో పాదయాత్ర హోరెత్తింది. ఈ సందర్భంగా అనంతపురంలో బహిరంగ సభ నిర్వహించారు.

లోకేశ్ మాటల తూటాలు...

  • యువతదెబ్బకు సింగిల్ సింహం అహంకారం నేలకు దిగింది!
  • ఇది ట్రైలర్ మాత్రమే... రాబోయే రోజుల్లో అసలు సినిమా ఉంటుంది.
  • 151 సీట్లతో గెలిపించింది తప్పుడు కేసులు పెట్టమనా?
  • అప్పుతీర్చలేదని బీసీ మహిళను వివస్త్రను చేసి వేధిస్తారా?
  • నెల్లూరు జిల్లా పొద‌ల‌కూరు మండ‌లం చాట‌గొట్లలో వైసీపీ నేత అచ్చి ప్ర‌భాక‌ర్ వ‌డ్డిపాలేనికి చెందిన ల‌క్ష్మి అప్పుతీర్చ‌లేద‌ని ఆమె సోదరి అన‌సూయ‌మ్మను వివస్త్రను చేసి దాడికి పాల్ప‌డ్డారు. వైసీపీ నేత‌ల ఒత్తిడితో పోలీసులు కేసు కూడా న‌మోదు చేయ‌లేదు. దీంతో ఆమె పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. 
  • అధికారంలోకి వచ్చాక బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తాం
  • మోటార్లకు మీటర్లు పెడితే పగులగొట్టండి... మేం చూసుకుంటాం!
  • నేను యువగళం ప్రారంభించినపుడే చెప్పా సాగనిస్తే పాదయాత్ర అడ్డుకుంటే దండయాత్ర అని. 
  • నువ్వు రాజారెడ్డి రాజ్యాంగం పవర్ ఏంటో చూపిస్తే... నేను అంబేద్కర్ గారి రాజ్యాంగం దమ్మేమిటో చూపిస్తా. 
  • సొంత పార్టీ ఎమ్మెల్యేలను పురుగుల్లా చూసాడు. ప్రశ్నిస్తే కేసులు పెట్టి వేధించాడు. ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. అయ్యా మీ సీట్లు మీకే... నన్ను ఒంటరిని చేసి పోకండి అని బ్రతిమాలుకుంటున్నాడు.
  • ఈ రోజు రాష్ట్ర ప్రజలను నేను కొన్ని ప్రశ్నలు అడగాలి అనుకుంటున్నా. జనం జగన్ కి 151 సీట్లు ఇచ్చింది ఎందుకు? లోకేశ్ పై ఎస్సీ, ఎస్టీ, హత్యాయత్నం కేసులు పెట్టమనా? టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపమనా? మీరు ఓటు వేసింది ఎందుకు? జగన్ చేసింది ఏంటి? రాష్ట్ర ప్రజలంతా ఒక్క సారి ఆలోచించండి.
  • వాలంటీర్ వాసుని పంపి గోబెల్స్ ప్రచారం మొదలు పెట్టారు. వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి టీడీపీ గెలిస్తే సంక్షేమ కార్యక్రమాలు ఆపేస్తారు అని ప్రచారం చేస్తున్నారు. 
  • బ్రదర్ జగన్... సంక్షేమాన్ని రాష్ట్రానికి పరిచయం చేసిందే టీడీపీ. సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన హిస్టరీ నీది జగన్.

అనంత వెంకట్రామిరెడ్డి అవినీతి అనంతం

ఇప్పటి వరకూ తిరిగిన నియోజకవర్గాల్లో ఒక ఎమ్మెల్యేకి ఒక పేరు మాత్రమే పెట్టాను... కానీ ఇక్కడ ప్రజల కోరిక మేరకు మూడు పేర్లు పెట్టక తప్పడం లేదని లోకేశ్ వ్యాఖ్యానించారు. మీ ఎమ్మెల్యే గారి పేరు అనంత వెంకటరామిరెడ్డి. ఆయన అవినీతి అనంతం. ఆయన్ని ఇక్కడ ముద్దుగా చేతగాని ఎమ్మెల్యే, కమీషన్ ఎమ్మెల్యే, 9 నంబర్స్ ఎమ్మెల్యే అంటారట అని ఎద్దేవా చేశారు. "ఇచ్చిన ఏ హామీ నిలబెట్టుకోలేదు కాబట్టి చేతగాని ఎమ్మెల్యే, ప్రతి దాంట్లో కమీషన్ తీసుకుంటాడు కాబట్టి కమీషన్ ఎమ్మెల్యే, ఇక ఎవరు వెళ్లి సహాయం చెయ్యమని అడిగినా తన ఫోన్లో 9 నంబర్లు కొట్టి ఫోన్ మాట్లాడినట్టు నటిస్తాడంట.. అందుకే 9 నంబర్స్ ఎమ్మెల్యే" అని వివరించారు.

మేం తెచ్చిన రోడ్డుకు అనంత కమీషన్లు

పంగల్ రోడ్డు నుంచి బళ్లారి బైపాస్ వరకు అర్బన్ లింక్ రోడ్డును టీడీపీ హయాంలోనే మంజూరు చేయించామని లోకేశ్ వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి తన జేబు నింపుకోవడం కోసం రోడ్డు కాంట్రాక్టర్ నుంచి 10 కోట్ల రూపాయలు కమిషన్ తీసుకున్నారని ఆరోపించారు. దీంతోపాటు రోడ్డు విస్తరణలో తమకు అనుకూలంగా ఉండే వారి ఇళ్లు, షాపులు పోకుండా రోడ్డును అష్టవంకరలు తిప్పారు. ఇదంతా తమ అనుచరులు తమ నాయకుల ఆస్తులు పోకుండా ఉండడం కోసం ఎమ్మెల్యే చేసిన అరాచకం. ఇదే కాకుండా రోడ్డు విస్తరణలో షాపులు, ఇళ్లు పోకుండా ఉండడం కోసం యజమానుల నుంచి కోట్లల్లో వసూలు చేశారు. ఈయన అరాచకాలపై ఓ రిటైర్డ్ ఏఎస్పీ సీఎం జగన్ కు లేఖ కూడా రాశారు" అని వెల్లడించారు. 

ఆర్డీటీ కార్యాలయాన్ని సందర్శించిన లోకేశ్ 

అనంతపురంలోని రూరల్ డెవలప్ మెంట్ ట్రస్ట్ (ఆర్డీటీ) కార్యాలయాన్ని లోకేశ్ సందర్శించారు. ఆర్డీటీ వ్యవస్థాపకులు విన్సెంట్ ఫెర్రర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. విన్సెంట్ ఫెర్రర్ సతీమణి అన్నే ఫెర్రర్ కి నమస్కరించి ఆమె ఆశీస్సులు తీసుకున్నారు. ఆర్డీటీ కార్యాలయంలోకి లోకేశ్ ని విన్సెంట్ ఫెర్రర్ కుమారుడు మాంచో ఫెర్రర్, ఆయన సతీమణి విశాల ఫెర్రర్ సాదరంగా ఆహ్వానించారు. ప్రభుత్వానికి సమాంతరంగా ఆర్డీటీ అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని లోకేశ్ ఈ సందర్భంగా కొనియాడారు. 1969లో ఎన్నో అవమానాలు ఎదురైనా పేదలకు సేవలు అందించాలనే ధృడ సంకల్పంతో విన్సెంట్ ఫెర్రర్ గారు చేసిన కృషి చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. "టీడీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉమ్మడి ప్రణాళిక సిద్దం చేసుకొని ప్రత్యేక కార్యక్రమం రూపొందిస్తాం. మహిళల పట్ల ఉన్న చులకన భావం, మహిళలకు ఆర్ధిక స్వేచ్ఛ కల్పించడం కోసం ఆర్డీటీ ఎంతో కృషి చేస్తుంది. ప్రభుత్వం వచ్చిన వెంటనే మహిళల అభివృద్ది కోసం ఆర్డీటీతో కలిసి పనిచేస్తాం" అని లోకేశ్ పేర్కొన్నారు. 

=====

*యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఇప్పటి వరకు నడిచిన దూరం 773.9 కి.మీ.*

*ఈరోజు నడిచిన దూరం 13.8 కి.మీ.*

*61వరోజు (5-4-2023) యువగళం పాదయాత్ర వివరాలు:*

*ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గం*

ఉదయం

8.00 – పిల్లిగుండ్ల ఎంవైఆర్ కళ్యాణ మండపం క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర ప్రారంభం.

8.30 – పాదయత్ర ఉరవకొండ నియోజకవర్గంలోకి ప్రవేశం.

9.10 – గొట్కూరులో స్థానికులతో మాటామంతీ.

9.50 – మణిపాల్ స్కూల్ వద్ద గ్రామస్తులతో సమావేశం.

10.05 – బ్రాహ్మణపల్లి వద్ద యాదవ్ సామాజికవర్గీయులతో భేటీ.

10.20 – రామచంద్రపురం క్రాస్ వద్ద స్థానికులతో మాటామంతీ.

11.25 – కమ్మూరులో భోజన విరామం.

మధ్యాహ్నం

2.30 – కమ్మూరు నుంచి పాదయాత్ర కొనసాగింపు.

సాయంత్రం

4.30 – కూడేరు బహిరంగసభలో యువనేత లోకేశ్ ప్రసంగం.

5.50 – కూడేరు విడిది కేంద్రంలో బస.

******

  • Loading...

More Telugu News