Priyadarshi: 'బలగం' షోలను ఆపేసే ఆలోచన లేదు: ప్రెస్ మీట్ లో దిల్ రాజు

Dil Raju Press Meet

  • ఊరూరా 'బలగం' ఫ్రీ షోలు 
  • దిల్ రాజు ఆపేయనున్నాడని ప్రచారం
  • ఈ విషయంపై ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన దిల్ రాజు 
  • జనాలు ఈ సినిమా చూడటమే తనకి కావాల్సిందని స్పష్టత


ఈ మధ్య కాలంలో చాలా చిన్న సినిమాగా వచ్చి, పెద్ద విజయాన్ని సాధించిన సినిమాగా 'బలగం' కనిపిస్తుంది. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్లో నిర్మితమైన ఈ సినిమాకి, వేణు దర్శకత్వం వహించాడు. కొన్ని గ్రామాలలో 16MM తెరలు కట్టి ఈ సినిమాను ఉచితంగా ప్రదర్శిస్తున్నారు. అలాంటి షోస్ ను దిల్ రాజు ఆపేసే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. 

ఈ విషయంపై దిల్ రాజు కొంతసేపటి క్రితం ప్రెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. "ఏ రకంగానైనా ఈ సినిమాను జనమంతా చూడాలనేది మా కోరిక. థియేటర్ ద్వారా .. ఓటీటీ ద్వారా .. టీవీల ద్వారా ఈ సినిమా జనంలోకి వెళ్లాలనే అనుకున్నాము. ఇప్పుడు నాలుగో ఆప్షన్ కూడా వచ్చేసింది. ఊరూరా తెరలు కట్టేసి ఈ సినిమాను వేసుకుని చూస్తారని మేము ఊహించలేదు. ఈ సినిమాను ఎక్కడ ప్రదర్శిస్తున్నా ఆపేసే ఉద్దేశం లేదు .. ఓపెన్ గా చెబుతున్నాను ఎక్కడా ఆగదు" అన్నారు.

'బలగం' సినిమా చూసి .. గతంలో విడిపోయిన చాలా కుటుంబాలు కలుసుకుంటూ ఉండటం మాకు ఆనందాన్ని కలిగించే విషయం. ఇంతవరకూ నేను చేసిన 50 సినిమాలలో, ఒక్క 'బొమ్మరిల్లు' ద్వారా కొన్ని ఫ్యామిలీస్ లో మార్పు వచ్చింది. 'బలగం' సినిమాతో అంతకంటే ఎక్కువ కదలిక వచ్చింది. ఈ సినిమాకి ఒక్క నెలలోనే 5 ఇంటర్నేషనల్ అవార్డ్స్ రావడం విశేషం. తెలుగు సినిమా చరిత్రలో 'బలగం' సినిమాకి ఒక పేజీ ఉంటుంది" అని చెప్పుకొచ్చారు. 

More Telugu News