Raviteja: ఆ ఒక్కమాట మాత్రం అడగొద్దు .. అదే సస్పెన్స్: రవితేజ

Raviteja Interview

  • 'రావణాసుర'గా కనిపించనున్న రవితేజ 
  • తెరపై సందడి చేయనున్న ఐదుగురు హీరోయిన్స్  
  • ప్రతి సీన్ సస్పెన్స్ తో ముడిపడి ఉంటుందన్న రవితేజ
  • ఈ నెల 7వ తేదీన రిలీజ్ అవుతున్న సినిమా 


సాధారణంగా రవితేజ సినిమాల్లో హింస తక్కువగా ఉంటుంది .. కామెడీ టచ్ ఎక్కువగా ఉంటుంది. ఇక ఆయన నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలు కూడా చేయలేదు. ఈ సారి ఆయన నెగెటివ్ షేడ్స్ తో కూడిన పాత్రలను చేయడమే కాకుండా, కామెడీ టచ్ తో పాటు హింస డోస్ పెంచినట్టుగా ఇంతవరకూ వచ్చిన అప్ డేట్స్ వలన అర్థమవుతోంది.

ఈ నెల 7వ తేదీన ఈ సినిమా విడుదలవుతూ ఉండటంతో, ప్రమోషన్స్ లో భాగంగా రవితేజను .. డైరెక్టర్ సుధీర్ వర్మను సుమ ఇంటర్వ్యూ చేసింది. సుమ అడిగిన ప్రశ్నకు రవితేజ స్పందిస్తూ .. "షూటింగు సమయంలో గాయాలు కావడం సహజం. కాళ్లకు .. చేతులకు గాయాలైనా షూటింగు ఆగిపోవడానికి ఇష్టపడను. అయినా కెమెరా ముందుకు వెళితే నాకు ఏ నెప్పులూ తెలియవు" అని అన్నారు. 

"ఇక ఈ సినిమాలో హీరో లేడని అంటున్నారు .. మరి ఐదుగురు హీరోయిన్స్ ఎవరి కోసం? అంటూ సుమ అడిగింది. ఆ విషయం మాత్రం అడగొద్దు .. అదే సస్పెన్స్. ఈ ప్రశ్నకి ఆన్సర్ కావాలంటే 7వ తేదీ వరకూ వెయిట్ చేయవలసిందే .. ఈ సినిమా చూడవలసిందే. ఈ సినిమాకి సంబంధించి ఏది అడిగినా అవునని చెప్పను .. కాదనీ చెప్పను" అని రవితేజ సమాధానమిచ్చారు. 

More Telugu News